Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ మట్టెవాడ
పేద ఆర్యవైశ్యుల సంక్షేమమం కోసం పుట్టిందే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అని పేద ఆర్యవైశ్యుల కోసం ఫెడరేషన్ సభ్యులు పనిచేయాలని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీని వాస్ గుప్తా అన్నారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వరం గల్ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్య క్రమం ఆదివారం రామన్నపేటలోని ఆర్యవైశ్య సత్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలం గాణ హస్తకళల బోర్డు చైర్మన్ బొల్లం సంపత్ , స్థానిక కార్పొరేటర్ గందె కల్పన నవీన్ తో కలిసి పాల్గొన్న ఆయన నూతన కార్యవర్గం చేత వాసవి మాత సాక్షిగా ప్రమాణ స్వీ కారం చేయించారు. ఐవిఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షులుగా పుల్లూరు మధు, ప్రధాన కార్యదర్శిగా గుమ్మడవెల్లి సురేష్, కోశాధికారిగా ఎలగందుల రాజేందర్,లతో కూడిన కార్యవర్గం కొలువైనది. కార్యక్రమంలో పేద ఆర్యవైశ్యులకు 50 మందికి కుట్టు మిషన్లు అంద జేశారు. అనంతరం సమా వేశాన్ని ఉద్దేశించి ఉద్దేశించి ఆయన మాట్లా డుతూ దేశవ్యాప్తంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ కుటుంబ భారా న్ని మోస్తున్న ఆర్యవైశ్యులను గుర్తించి వారిని ఆదుకోవడమే ఫెడరేషన్ ఉద్దేశమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ఇచ్చే సంక్షేమ పథ కాలను ఆర్య వైశ్యులకు చేరేలా చూడడమే లక్ష్యంగా ముందుకు పోతూ పేద ఆర్యవైశ్యులకు ఫెడరేషన్ ఆధ్వ ర్యంలో చేయూత ఇచ్చేలా కార్యక్రమాలు కొనసాగించాలని నూతన కార్యవర్గానికి సూచించారు. జిల్లాలోని పేద ఆర్యవైశ్యులను గుర్తించి ఎన్నికైన నూతన కమిటీ వారికి అండగా నిలబడాలని అన్నారు. తెలంగాణ హస్తకళల బో ర్డు చైర్మన్ బొల్లం సంపత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో తెరాస ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్యవైశ్యులకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారని ఆర్యవైశ్యులను గుర్తించి ఉన్న తమైన పదవులు అందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఐ వి ఎఫ్ జాతీయ కమిటీ సభ్యులు గట్టు మహేష్, రాజ మొగిలి గుప్తా, రాములు, ఐవిఎఫ్ వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శైలజ, బచ్చు శ్రీనివాస్, తోనుపు నూరి వీరన్న తదితరులు పాల్గొన్నారు.