Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరిగిన ధరలతో పేదల అవస్థలు
- బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్న ప్రభుత్వం
- నిత్యావసరాలు పంపిణీ చేయాలని లబ్ధిదారుల విజ్ఞప్తి
నవతెలంగాణ-తొర్రూరు
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రేషన్ దుకాణాల ద్వారా అందిస్తున్న సబ్సిడీ సరుకులను కేవలం బియ్యానికి పరిమితం చేసింది. ప్రతి పేదవాడు బియ్యంతో పాటు వంటకు కావాల్సిన పప్పు గోధుమలు నూనె చింతపండు వంటి ఎన్నో రకాల నిత్య అవసరాల వస్తువులు అవసరం ఉంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాలలో అందించే సరుకులలో కేవలం బియ్యానికే పరిమితం చేసి మిగిలిన సరుకులను పంపిణీ చేయడం లేదు. దీంతో ఆయా గ్రామాల రేషన్ లబ్ధిదారులు రేషన్ దుకాణాలలో అందించే సరుకులు అందక, బయట మార్కెట్లో ఉన్న సరుకుల ధరలతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
9 రకాల సరుకులకు మంగళం.......
తొరూరు మండలంలో ఒక మున్సిపాలిటీ, 29 గ్రామపంచాయతీలకు గాను 41 రేషన్ దుకాణాలు ఉండగా అందులో ఆయా గ్రామాలకు చెందిన 22 వేల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులు గ్రామాల్లో రేషన్ తీసుకుంటున్నారు. గత ప్రభుత్వాలు తొమ్మిది రకాల సరుకులను పంపిణీ చేసేవారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం రేషన్ బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేస్తుంది. ఆహార భద్రత అమలులోకి వచ్చిన నాటి నుంచి కుటుంబంలో ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తు న్నారు. మార్కెట్లో నిత్యవసర వస్తు వుల ధరలు విపరీతంగా పెరుగు తుండడంతో సబ్సిడీపై సరుకులను అందజేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
పాత విధానానికి స్వస్తి.......
గత కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కు సబ్సిడీపై తొమ్మిది రకాల నిత్యావసర సరుకులను సబ్సిడీ రూపంలో అందించేది. మాజీ ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో అమ్మహస్తం పథకం లో భాగంగా బియ్యంతో పాటు కిరోసిన్ వంటనూనె చింతపండు పప్పులు, గోధుమలు పంచదార ఉప్పు పసుపు కారంపొడి వంటి 9 రకాల సరుకులను రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు అందజేస్తుండేవారు.
కానీ ప్రస్తు త ప్రభుత్వం పాత విధానాలకు స్వస్తి పలికి కేవలం రేషన్ బియ్యాన్ని మాత్రమే సరఫరా చేస్తూ కాలం వెళ్ల దీస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల పేద ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు అన్ని రకాల నిత్యావసర సరుకులను సబ్సిడీ రూపంలో అందించేందుకు చర్యలు తీసుకుని పేద ప్రజలను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
అన్ని సరుకులు అందించాలి
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా అన్ని సరుకులు అందించేలా చర్యలు తీసుకోవాలి. ఒక్క బియ్యం పంపిణీ చేస్తూ ఉన్న సరుకులను తీసి వేయడం సరికాదు. పెరిగిన నిత్యవసర ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ధరలను నియంత్రించి, సబ్సిడీపై అన్ని రకాల సరుకు లను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
కొనుగోలుకు ఇబ్బంది..
గత ప్రభుత్వాలు 9 రకాల సరుకులను పంపిణీ చేస్తే ప్రస్తుత ప్రభుత్వం వాటిని విస్మరించింది. కేవలం రేషన్ బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారు. నిత్యావసర సరుకుల కొనుగోలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ కార్డుదారులను గుర్తించి బియ్యంతో పాటు కిరోసిన్, వంటనూనె, చింతపండు పప్పులు, గోధుమపిండి చక్కెర ఉప్పు పసుపు సరుకులను సబ్సిడీపై పంపిణీ చేసేలా చూడాలి.