Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం
నవతెలంగాణ-గార్ల
కేంద్రంలో బీజేపీ మతోన్మాద, కార్పొరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోడీపై తిరుగుబాటు చేసేందుకు రైతులు సిద్ధంగా ఉండా లని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శెట్టి వెంకన్న పిలుపునిచ్చారు. స్తానిక మంగపతిరావు భవనంలో సోమవారం బొబ్బా ఉపేందర్ రెడ్డి అధ్య క్షతన జరిగిన ఎఐకేఎస్ మండల 2వ మహసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం రైతులకు ఉన్న సబ్సిడీలను ఎత్తివేసి మూడు నల్లా చట్టాలను తీసుకవచ్చారన్నారు. విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చి మోటార్లకు మీటర్లు పెట్టే కుట్రలు చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. నల్లా చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ నడిబొడ్డున సంవత్సరం పాటు అందోళన చేస్తూ అనేక మంది రైతులు బలి కాగ ప్రధాని నరేంద్ర మోడీ నల్ల చట్టాలను రద్దు చేస్తూ ప్రకటించారని వెంటనే పార్లమెంట్ లో చట్టం చేయాలని డిమాండ్. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతులకు అందిస్తున్న రైతు బంధు బడా రైతులకు ఇవ్వకుండా కౌలు రైతులకు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణ మాఫీ చేసి వెంటనే కొత్త రుణాలు ఇవ్వాలని కోరారు. అర్హులైన పోడు రైతు లకు పట్టాలు ఇవ్వాలన్నారు. 30 శాతం ఉన్న కౌలు రైతులకు కౌలు చట్టాలను అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుతూ స్దానిక రైతులను ఏకం చేసి పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. రైతాంగ సమస్యల పోరాటానికి కేస ముద్రంలో జరిగే జిల్లా మహసభలు,నల్గొండ లో జరిగే రాష్ట్ర మహాసభలలో రూపకల్పన చేయను న్నట్లు తెలిపారు. అనంతరం మూడు సంవత్సరాల పాటు చేపట్టిన కార్యక్రమ నివేదికను కార్యదర్శి గడ్డి పాటి రాజారావు ప్రవేశ పెట్టారు. జిల్లా, మండల నాయకులు బి.లోకేశ్వరావు, కె.మహేశ్వరావు, కె.బాల, లచ్చయ్య, ఐ.గోవింద్, వశ్యా,రాము, వీరభద్రం, బుజ్జి, ఎస్. వెంకటేశ్వర్లు,వి. వీరభద్రం, వెంకటరెడ్డి, మోహన్ పాల్గొన్నారు.