Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మరిపెడ
కూలి, భూమి, ఉపాధి రక్షణకు ఉధతమైన పోరాటాలు నిర్వహించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అలవాల వీరయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మండ రాజన్న పిలుపునిచ్చారు, సోమవారం మరిపెడ మండలంలో పుల్లూరు దేవయ్య, నలగోల లక్ష్మారెడ్డి దొంతు మమత అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. అట్టడుగు వర్గాల హక్కుల కోసం కూలి పెంపునకు, నిరుపేదలకు భూమిపంపకం, కుల వివక్ష నిర్మూలన కోసం 1934 లో సుందరయ్య వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించారని గుర్తు చేశారు. నాటి నుండి నేటి వరకు భూస్వాముల, పెత్తం దారులు కొనసాగిస్తున్న ఆర్థిక దోపిడీకి సామాజిక అణిచి వేతకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు. మహబూబా జిల్లాలో మూడు లక్షల మంది వ్యవసాయ కూలీలలకు సంవత్సరంలో 130 రోజులు పని దొరకడం లేదని అన్నారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలు లేక వలస పోతున్నారని అన్నారు. తక్షణమే పరిశ్రమలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభు త్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కమిటీని 13 మందితో ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా పుల్లూరు దేవయ్య ప్రధాన కార్యదర్శిగా గుండ గాని మధుసూదన్ ఉపాధ్యక్షులుగా పాల్వాయి రామన్న సహాయ కార్యదర్శిగా తాటికొండ అనంత చారి, దొంతు సోమన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న, డీవైఎఫ్ఐ మండల కన్వీనర్ కందాల రమేష్ సీఐటీయూ మండల నాయకులు తూము మల్లయ్య, సంఘం మండల నాయకులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.