Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ
స్వరాష్ట్రంలో ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధనకు తలపెట్టిన రిలే నిరహార దీక్ష ను అనుమతించలేని రాష్ట్ర ప్రభుత్వం,పోలీసుల నిరంకుశ వైఖరిని టీపీటీఎఫ్ ఖండిస్తున్నదని, ఇందుకు నిరసనగా యూఎస్పీసీ ఆధ్వర్యంలో నేడు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడిని జయప్రదం చేయాలని టీపీటీఎఫ్ పిలుపునిచ్చింది. సోమవారం వరంగల్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అధ్యక్షతన హనమకొండలో ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి కడారి భోగేశ్వర్ మాట్లాడారు. ఏడేండ్లుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు, నాలుగేండ్ల నుండి బదిలీలు లక ఇబ్బందులు పడుతున్నారన్నారు. జీఓ 317 ద్వారా నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 20 వేల ఉపా ధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. నియామకాలు జరిపేంత వరకు విద్యావాలంటీర్లను నియమించాలన్నారు. పారిశుద్ధ్య కార్మికుల నియామకాలు చేపట్టాలన్నారు. సీపీఎస్ రద్దు తదితర సమస్యల పరిష్కారానికి హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించ తలపెట్టిన రిలే నిరాహా రదీక్షలకు దరఖాస్తు చేసి నెల రోజులు కావస్తున్నా పోలీసులు అనుమతి ఇవ్వలేదన్నారు. అసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు జె స్వామి, వి. అజరు బాబు, కార్యదర్శులు .మనోజ్ గౌడ్, వీరస్వామి, వీరభద్రం, జిల్లా మాజీ అధ్యక్షలు సోమేశ్వర్ రావు, అశోక్, తదితరులు పాల్గొన్నారు