Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు భద్రయ్య
నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
రేషన్ డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని కోరుతూ డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు నిమ్మల భద్రయ్య ఆధ్వర్యంలో డీలర్లు అందరూ కలిసి సోమవారం తహశీల్దార్ సుమన్ కు వినతిపత్రం అందించారు. అనంతరం భద్రయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు భక్తుల రమేష్ ఆదేశాల మేరకు తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. రాష్ట్ర మొత్తం ఒకే విధంగా ఉండేలా కాంటాలు ఇవ్వకుండా కొన్ని జిల్లాకు ఫోనిక్స్ కాంటాలు కొన్ని జిల్లాకు సెల్కాన్ కాంటాలు ఇవ్వ డంతో అవి సరిగా పనిచేయకపోవడం ముట్టుకుంటే దాదాపు 5 నుంచి 10 కిలోలు తక్కువ చూపించడం లేదా ఎక్కువ చూపించడం జరుగుతుందని తెలి పారు. దీనివల్ల డీలర్లు తూకంలో లాస్ కావడం జరుగుతుందని వెంటనే సెల్కాన్ కాంటాలను తీసు కొని పోనిక్స్ కాంటాలు ఇవ్వవలసిందిగా డిమాండ్ చేశారు. గతంలో ఇలాంటి సమస్య ఎన్నడూ రాలే దని విజన్ టెక్ వారు సమస్యను పరిష్కారం చేయ కుండా రేషన్ డీలర్లతో ఆడుకుంటున్నారని వెంటనే సిమ్ములను యాక్టివేట్ చేసి సిగల్ పెంచాలని కోరా రు. కార్యక్రమంలో రేషన్ డీలర్ల మండల ప్రధాన కార్యదర్శి బజ్జురి చంద్రమౌళి, వర్కింగ్ ప్రెసిడెంట్ సూదమల్ల కిషన్, వైస్ ప్రెసిడెంట్ పెండ్లి సునీత రాంరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గంగాధర్ లావణ్య రాజు, జిల్లా కార్యదర్శి బొచ్చు లక్ష్మీ ప్రభాకర్, వంగ ధనలక్ష్మి సుధాకర్, వీరన్న, శరత్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.