Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీడీఏ పీవో అంకిత్
నవతెలంగాణ-ఏటూరునాగారం టౌన్
ఏటూరునాగారం కొమరం భీం స్టేడియంలో జరగనున్న క్రీడల్లో రాష్ట్రస్థాయిలో ఏటునాగార ఐటీడీఏకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చే విధంగా గిరిజన క్రీడాకారులు పతకాలు సాధించడానికి పిడి, పిఈటిలు చురుకుగా పాల్గొనాలని ఐటిడిఏ పీవో అంక ఓిత్ ఆదేశించారు. మండల కేంద్రంలో సోమ వారం ఐటిడీఏ కార్యాలయ సమావేశంగదిలో ఉమ్మ డి వరంగల్ జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలకు చెందిన పిడి, పిఈటిల విద్యాశాఖ అధికారులతో పీవో సమా వేశం నిర్వహించారు. అనంతరం పిఓ మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేం దుకు పెద్ద ఎత్తున నిర్వహించే పోటీలను పగడ్భం దీగా నిర్వహించాలని అన్నారు. ముందుగా ఈనెల 13, 14వ తేదీల్లో డివిజన్ స్థాయి క్రీడలను నిర్వహించడానికి షెడ్యూల్డ్ ఖరారు చేశారు. ఆయా పాఠశాలల క్రీడాకారులకు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, టెన్నికాయిట్, చెస్, క్యారమ్స్, అథ్లెటిక్స్, వివిధ రకాల పోటీలను నిర్వహంచనున్నారు. 6 నుంచి 8వ తరగతి వరకు అండర్ 14 విభాగం, 9వ, 10వ తరగతి వారికి అండర్ 17 విభాగంలో ఆడిస్తార న్నా రు. మేడారం, చిన్నబోయినపల్లి, పేరూరుల్లోని ఆశ్ర మ పాఠశాలల క్రీడా మైదానంలో డివిజన్ స్థాయి క్రీడలు నిర్వహించబడుతాయన్నారు. ఇందులో గెలుపొందిన క్రీడాకారులకు మురం భీం స్టేడియంలో ఈనెల 21 నుంచి 23 తేదీల్లో జిల్లా స్థాయి పోటీలు ఉంటాయన్నారు. అదేవిధంగా అక్టోబర్ 18 నుంచి 20వ తేదీ వరకు ఏటూరు నాగారం కొమురం భీం స్టేడియంలో రాష్ట్ర స్థాయి క్రీడలు జరుగుతాయన్నారు. ఈ క్రీడల్లో 33 జిల్లాలకు చెందిన గిరిజన క్రీడాకారులు పాల్గొం టారని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 1700ల మంది క్రీడాకారులకు మంచి శిక్షణ ఇచ్చి నైపుణ్యతను కనబర్చే విధంగా పీడీలు, పీఈటీలు శ్రద్దచూపాలన్నారు. కార్యక్రమంలో డీడీ పోచం, ఏటీడీఓ దేశిరాం, స్పోర్ట్స్ అధికారులు శ్యామలత, ఆదినారాయణ, వజ్జ నారాయణ, కిష్టు, మోహన్, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.