Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజావాణిలో కలెక్టర్ ఎస్ క్రిష్ణ ఆదిత్య
నవతెలంగాణ-ములుగు
పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన జిల్లా వివిధ శాఖల అధికారులతో ప్రజావాణి కార్యక్రమం నిర్వ హించారు. దరఖాస్తుదారుల నుండి కలెక్టర్ నేరుగా దరఖా స్తులు స్వీకరించారు. మొత్తం 39 దరఖాస్తులు రాగా వాటిని సంబంధిత శాఖ అధికారులకు సిఫారసు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షా ప్రభావం ఎక్కువ ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు వహిస్తూ ఆరోగ్యశాఖ మెడికల్ కొరత లేకుండా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచిం చారు. వెంకటాపురం మండలం ఏదిరా ప్రాథమిక పాఠశాల భవనాన్ని శిథిల వ్యవస్థలో ఉన్నందున పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా చేయాలని నేటి కొరత లేకుండా చూడాలన్నారు.పరిశ్రమల శాఖ ద్వారా యువతను ప్రోత్సహించేందుకు రుణాలు అందించాలని పరిశ్రమల జిల్లా అధికారిని ఆదేశించారు. రోడ్డు మరుమత్తుల పనులు వారంలో పూర్తి చేయాలని ఆర్ అండ్బి, పిఆర్శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వై వి గణేష్, డిఆర్‌ఒ కే రమాదేవి, వైద్యాధికారి అప్పయ్య, వ్యవసాయ అధికారి గౌస్ హైదర్, కలెక్టరేట్ ఏవో విజయభాస్కర్, డి డబ్లూఓ హే మలత బీసీ సంక్షేమ అధికారి లక్ష్మణ్, పాల్గొన్నారు.
భూపాలపల్లి : పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిం చారు. దరఖాస్తు దారుల నుండి కలెక్టర్ నేరుగా దరఖా స్తులు స్వీకరించారు.మొత్తం 43 దరఖాస్తులు రాగా వాటిని సంబంధిత శాఖల అధికారులకు సిఫారసు చేశారు.ఈ సం దర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖలో పెండింగ్‌లో ఉన్న పనులను సత్వరమే పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
సమస్యలను అధికారులు పరిష్కరించాలి
ఏటూరునాగారం టౌన్ : గిరిజనుల సమస్యలకు ఆయా సెక్టార్ అధికారులు పరిష్కారం చూపాలని ఐటీడీఏ పీఓ అంకిత్ అన్నారు. సోమవారం స్థానిక గిరిజనదర్భార్లో గిరిజనుల నుంచి పీఓ వినతులను స్వీకరించారు. మం డలంలోని బందాల పరిధిలోని ఐదు గ్రామాలకు వెళ్లే రోడ్లు దెబ్బతిన్నాయని, మరమ్మతులు చేయించాలని సర్పంచ్ మోహన్‌రావు పీఓను కోరారు. సెప్టెంబర్ 14, 15వ తేదీల్లో జరిగే పెద్దల పండుగ సెలవు ఇవ్వాలని తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పొడెం శోభన్ వినతి పత్రాన్ని సమర్పిం చారు. ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయంచేయాలని వెంకటాపురం(కె) బోదాపురం గ్రామానికి చెందిన సోయం ప్రవీణ్‌కుమార్ వేడుకున్నారు. గురుకులంలో స్టాఫ్‌నర్సు ఉద్యోగం ఇప్పించాలని ఏటూరునాగారం మండల కేంద్ర ానికి చెందిన సునారికాని స్వప్న పీఓకు మొర పెట్టుకు న్నారు. మంగపేట మండలం శనిగకుంట గ్రాంలో వైకుంఠ దామం మంజూరు చేయాలని స్థానిక గిరిజనులు రామ్మూర్తి, నర్సింహరావు కోరారు. గిరిజనులు అందజేసిన వినతులను పరిశీలించిన ఆయా సెక్టోరియల్ అధికారుల ద్వారా పరిష్కా రం చూపుతా మన్నారు. గిరిజనులు ఏ సమస్య ఉన్నా నేరు గా వచ్చి సంప్రదించాలన్నారు. కార్యక్రంలో ఏపీఓ వసం తరావు, డీడీ పోచం, ఎస్డీసీ రాములు, ఈఈ హేమలత, పీహెచ్ఓ రమణ, ఎస్ఓ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.