Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు
నవతెలంగాణ-భూపాలపల్లి
సింగరేణిలో ఇటీవల నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ పోస్టులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత సమగ్ర విచారణ చేపట్టాలని, కోట్ల రూపాయలు వసూలు చేసిన దళారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయి లు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని శ్రామిక భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 4న సిం గరేణి యాజమాన్యం జేఎన్టీయూ ఆధ్వర్యంలో 177 జూనియర్ అసిస్టెంట్ క్లర్కుల పోస్టులకు సంబం ధించి పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్ష పత్రాలు సీల్చేసి లేవని అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేసిన జెఎన్టీయూ, సింగరేణి యాజమాన్యం పట్టించు కోలేదన్నారు. పరీక్షలకు ముందు మంచిర్యాల కేంద్రంగా కోచింగ్ సెంటర్ ఒక్కొక్క అభ్యర్థి నుండి రూ.20 నుండి రూ.25 లక్షల వరకు ఉద్యో గాలు ఇప్పిస్తామని పేరుతోనే అభ్య ర్థుల నుండి కోట్ల రూపా య లు వసూలు చేసినట్టు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో కథనాలు వచ్చా యన్నారు. 10వ తేదీకి ముం దు జేఎన్టీయూ సింగరేణి యాజమాన్యం రిలీజ్ చేసిన టువంటి కీ పేపర్లో అభ్యర్థు లు చెక్ చేసుకుంటే అదే రోజున యాజమాన్యం, జేఎన్టీయూ రిలీజ్ చేసిన లిస్టులో ప్రకటించిన మార్కులకు 10 నుంచి 20 వరకు తేడాలు వచ్చాయని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ సింగరేణి యాజమాన్యం జేఎన్టీయూ తుంగలో తొక్కిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావతంగా సింగరేణి యాజమాన్యం పకడ్బందీ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంగా ఇద్దరు దళారులు ఉన్నట్టు వారిని విజిలెన్స్ అధికారులు విచారించి క్షమాపణ పత్రాలు రాసుకొని వదిలేసినట్లు, వారి వద్ద ఐడి కార్డులు అనేక రకాల ప్రూఫ్‌లు బయటపడ్డట్టు పత్రికలలో ప్రకటనలు వస్తున్నాయి. వీటన్నింటిమీద సమగ్ర మైనటువంటి విచారణ చేపట్టకుంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయ కులు వెలిశెట్టి రాజయ్య, ఎండి చిన్న రాజాకు తదితరులు పాల్గొన్నారు.