Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ-ములుగు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖలో ప్రతిష్టాత్మకంగా ప్రారం భించినటువంటి తొలి మెట్టు కార్యక్రమం పర్యవేక్షణ అధికారులైన మండల విద్యాశాఖ అధికారులు, క్లస్టర్ నోడల్ అధికారులకు సోమవారం టిఎస్ఆర్ఎస్ బండారుపల్లి పాఠశాలలో మొదటి రోజు శిక్షణా కార్యక్రమం విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి తొలిమెట్టు కార్యక్రమాన్ని సంవత్సరం మొత్తం పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని సూచించారు. క్లస్టర్ నోడల్ అధికారులు పర్యవేక్షణలో భాగంగా పిల్లల అభ్యసన స్థాయి, ప్రస్తుత పరిస్థితి,ఎన్ఎయస్ ఫలితాలను విశ్లేషించుకోవాలని, తొలిమెట్టు కార్యక్రమం మార్గదర్శకాలు, పాఠశాల స్థాయి కార్యక్రమాలు అమల అయ్యేలా చూడాలని సూచించారు. విద్యాశాఖ కోఆర్డినేటర్లు సాంబయ్య, రాజులు సం దర్శించి మండల విద్యాశాఖ అధికారులు, క్లస్టర్ నోడల్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో అబాస్ అటెండెన్స్ వేయాలని, విద్యార్థులకు రెండు జతల దుస్తులు అందించేలా తగు ఏర్పాటు చేయాలని, విద్యార్థుల వివరాలు తప్పకుండా చైల్డ్ ఇన్ఫో లా నమోదు అయ్యేలా చూడాలని సూచించారు.