Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఈవో రాజేందర్
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లాలో చేపట్టిన నోడల్ అధికారుల శిక్షణను సద్విని చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ముద్దమల్ల రాజేందర్ సూచించారు. సోమవారం డీఈవో కార్యాలయంలో తొలిమెట్టు-మౌలిక భాష గణిత సామర్థ్యాల సాధన కార్యక్రమం ఎంఈవోలకు, కాంప్లెక్స్ నోడల్ అధికారులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని డీఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల విద్యలో ప్రాథమిక స్థాయి పునాది వంటిదని ప్రాథమిక స్థాయి పూర్తి అయ్యేసరికి విద్యార్థుల్లో మౌలిక భాషా గణిత సామర్ధ్యాలు సాధన జరిగినప్పుడే భవిష్యత్తు అభ్యసనం అర్ధవంతంగా ప్రభావవంతంగా మారు తుందని అన్నారు. సమాజ అభివృద్ధి జాతీయ అభివద్ధి ఆర్థిక అభివద్ధిలో విద్య చాలా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కోఆర్డినేటర్ కె లక్ష్మణ్ మాట్లా డుతూ ప్రణాళిక బద్ధంగా శాస్త్రీయ బోధన వ్యూహాల ద్వారా బోధన ప్రక్రియలను నిర్వహించాల్సి ఉంటుం దన్నారు. విద్యార్థులందరూ నేర్చుకునేలా అభ్యాసం కల్పిం చాల్సి ఉంటుందని దీం ట్లో ముఖ్య పాత్ర పోషించే కీలక వ్యక్తులు ఉపాధ్యాయులు అని అన్నారు. శిక్షణ కార్యక్ర మంలో మండల విద్యాధి కారులు ఏ. దేవ, కే రఘుపతి, సిహెచ్ సురేందర్, వి ప్రభా కర్ అన్ని కాంప్లెక్స్ నోడల్ అధికారులు పాల్గొన్నారు.
ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్ల గడువు పెంపు
ఈనెల 24 వరకు ఓపెన్ పదవ తరగతి, ఇంటర్ అపరాద రుసుముతో అడ్మిషన్లకు గడువు పొడిగించినట్లు డీఈవో ముద్దమల్ల రాజేందర్, ఓపెన్ స్కూల్ వరంగల్ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ టెన్త్, ఇంటర్మీడియట్ కోర్సులలో చేరాలని ఆసక్తి ఉన్న అభ్యర్ధులు సమీపంలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాలు గల ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపలను సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు పరీక్షల నియంత్రణాధికారి బానోత్ జుమ్మునాయక్ 9951946418, డీసీఈబీ సహాయ కార్యదర్శి శని గరం భద్రయ్య 9493041014 నంబర్లలో సంప్రదించాలన్నారు. మిగితా వివరాలకు www.telanganaopenschool.org అనే వెబ్ సైట్లో చూడవచ్చని కోరారు.