Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరిం చాలని జనగామ జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గ్రీవెన్స్ డే సందర్భంగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుండి పలు వ్ఞిప్తులను స్వీకరించారు. స్టేషన్ ఘన్పూర్ మండలం రాఘవపూర్‌కు చెందిన గౌడ కులస్తులు కోటి వరాల పథకం కింద 15 మందికి నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇచ్చారని, కబ్జాదారులు ఆక్రమించారని చర్యలు తీసుకోవాలని బాధితులు ఎల్లస్వామి, మల్లేషు, వెంకటస్వామి తదితరులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పి కాలువ కింద 1.7 ఎకరాల భూమికి రూ.ఏడు లక్షల 75 వేల జమ చేసిందని, బ్యాంకు అధికారులు హౌల్డ్‌లో పెట్టారని, డబ్బులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని పాలకుర్తి మండలం చె న్నూరుకు చెందిన రైతు అంజయ్య విన్నవిం చాడు. గోపరాజుపల్లి గ్రామానికి చెందిన నర సింహులు తన కూతురు రుద్ర బోయిన అశ్విత వివాహ 2017లో జరిపించినాని, కల్యాణ లక్ష్మికి దరఖాస్తు చేసుకున్న నేటికీ మంజూరు కాలేదని దరఖాస్తు చేశాడు. బచ్చన్నపేట మండలం లింగంపల్లికి చెందిన రామ్ రెడ్డి తాను లారీ ప్రమాదంలో వికలాంగుడిగా మారానని, వికలాంగుల పింఛన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జనగామ మండలం వనపర్తి కష్ణయ్య 2019లో కార్ యాక్సిడెంట్ రావడం వల్ల మతిస్థిమితం కోల్పోయి ఎర్రగడ్డ ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్నాని, ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డీఆర్డీఏ పీడీ రామ్‌రెడ్డి, ఉద్యానవనశాఖ అధికారి లత, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్
ప్రజావాణ ధరకాస్తులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీహనుమంతు అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.... ప్రజావాణి ధరకాస్తులను పరిశీలించి తగు చర్యలు తీసుకుని ప్రజలకు సత్వర సేవలు అందించాలన్నారు. నేటి ప్రజావాణిలో 79ధరకాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమలో, అదనపు కలెక్టర్ సంధ్య రాణీ, రెవెన్యూ డివిజనల్ అధికారి వాసు చంద్ర, డీఆర్డీఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్, జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.