Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జయప్రదం చేయాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-లింగాలఘనపురం
సెప్టెంబర్ 10 నుండి 17 వరకు వారం రోజుల పాటు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారో త్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొట్ల శేఖర్ అన్నారు. సోమవారం లింగాల గణపురం మండల కేంద్రం, మండలంలోని మాణిక్య పురం కళ్లెం సిరిపురం జీడికల్లు గుమ్మడివెళ్లి బండ్ల గూడెం నెల్లుట్ల నవాబుపేట, వడిచెర్ల నేలపోగుల గ్రామాలలో ప్రచార జీపు జాత నిర్వహించారు. సెప్టెంబర్ 17న జనగామ జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలలో మండల కార్యదర్శి బొడ్డు కరుణాకర్, మబ్బు వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించిన సభల్లో తెలం గాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు కళ్లెం గ్రామానికి చెందిన బహదూర్ సింగ్, సిరిపురం గ్రామానికి చెందిన బొడ్డు యాదగిరి గారిని సన్మా నించారు. అనంతరం వారు మాట్లాడుతూ భూస్వా ములు, జమీందార్లు, దేశ్ ముఖ్లు, తదితరులు ప్రజలను జలగల్లా పట్టిపీడిస్తుంటే ఎర్రజెండా కింద అందరినీ సమీకరించి పోరాటం నడిపించింది కమ్యూనిస్టులు అన్నారు. దున్నేవాడికి భూమిని పంచిన చరిత్ర కమ్యూనిస్టులదన్నారు. ఇంతటి విరోచిత పోరాటాన్ని వక్రీకరించడానికి ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేని బీజేపీ సెప్టెంబర్ 17 పేరుతో మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. దీనిని ప్రజలందరూ ప్రతిఘటించాల న్నారు. సెప్టెంబర్ 17న జనగామ జిల్లా కేంద్రంలో జరిగే భారీ బహిరంగ సభకు మండలం నుండి వందలాది మంది హాజరు కావాలని కోరారు. జిల్లా కమిటీ సభ్యులు భూక్య చందు నాయక్, చుంచు విజేందర్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి బొట్టు శివ, జిల్లా కోశాధికారి మేకల ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు బొట్టుసూరి శైలజ, జిల్లా అధ్యక్షుడు గుంటిపెళ్లి బాలు, మండల కమిటీ సభ్యులు తూటి దేవదానం, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు
17న జనగామలో బహిరంగ సభ
బచన్నపేట : తెలంగాణ రైతాంగ వారోత్సవాల సందర్బంగా బచ్చన్నపేట మండల కేంద్రంతోపాటు తమ్మడపల్లి చిన్నరాంచర్ల, పోచన్నపేటగ్రామాల్లో అమరవీరులను స్మరించుకుంటూ సోమవారం జీపు జాత నిర్వహించారు. ఈసందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్షి వర్గ సబ్యులు గొల్లపల్లి బాపు రెడ్డి, మండల కార్యదర్షి బెల్లైకొండ వెంకటెష్ మాట్లాడుతూ... జనగామలోని ప్రిస్టన్ గ్రౌండ్లో నిర్వహించే బారీ బహిరంగ సభకు సీపీఐ(ఎం) జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి హజరవు తున్నారని, విజయవంతం చేయాలని కోరారు. జిల్లా కమిటీ సభ్యులు సుంచు విజెందర్ మండల నాయకులు రావుల రవిందర్ రెడ్డి, రాగల్ల అషోక్, మహంకాలి జనార్ధన్, దుడల వెంకయ్య ఇంజ యెల్లయ్య, తదితరులు పాల్గొన్నరు.
జయప్రదం చేయాలి : సీపీఐ(ఎం)
జనగామ: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలో ఈనెల 17వ తేదీన నిర్వహించే మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ప్రకాష్ పిలుపునిచ్చారు. మహాసభకు సీపీఐ(ఎం) జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నట్లు తెలిపారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో మహాసభ కు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జయప్రకాష్ మాట్లాడారు. పార్టీ పట్టణ కమిటీ సభ్యులు బాల్నె వెంకట మల్లయ్య, కళ్యాణం లింగం, పందిళ్ళ కళ్యాణి, పల్లెర్ల లలిత, శాఖ కార్యదర్శిలు దూసరి నాగరాజు, సిద్ధిరాల ఉపేందర్, గంగరబోయిన మల్లేష్ రాజ్, మోకు భవాని, చంద్రకళ, ఎండి మై వెళ్లి, పోతుకునురి కనుక చారి, గుండేటి రమేష్, కల్లెప్ కుమార్, నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.
జీపు జాతా ప్రారంభం
దేవరుప్పుల : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ప్రజలు జయప్రదం చేయాలని కోరుతూ సీపీఐ(ఎం) పాలకుర్తి నియోజకవర్గ ఏరియా కార్యదర్శి వర్గ సభ్యుడు సింగారపు రమేష్ పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని ప్రధాన కూడలిలో జీపు జాతాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈనెల 17న జనగామ జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు చందు నాయక్, విజేందర్,న ాయకులు ఇంటి వెంకట్ రెడ్డి,కాసర్ల యాదవరెడ్డి,మాధవరెడ్డి, గడ్డం యాదగిరి,గోడిశాల రాములు,జాటోత్ శ్రీను నాయక్, ప్రజా నాట్య మండలి కళాకారులు శివ,సూరి,ప్రసాద్,శైలజ తదితరులు పాల్గొన్నారు.