Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయవంతం చేయాలి : ఎస్ఎఫ్ఐ
నవతెలంగాణ-మరిపెడ
కరీంనగర్ పట్టణంలో ఈనెల 14, 15 ,16 తేదీలలో జరగబోయే ఎస్ఎఫ్ఐ నాలుగవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు పెద్దబోయిన వీరబాబు పిలుపు నిచ్చారు. మహాసభలకు రాష్ట్రవ్యాప్తంగా 1000 మంది విద్యార్థి ప్రతినిధులు హాజరవుతారని, ముఖ్య అతిథులుగా కేరళ విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు, ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్ష కార్యదర్శులు హాజరవుతున్నారని తెలిపారు. సోమవారం మండ లంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. విద్యా ర్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం ఉద్యమి స్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ అన్నారు. కరీంనగర్ విద్యార్థి ఉద్యమాలలో చరిత్ర లో నిలిచిపోతుందన్నారు. రానున్న రోజుల్లో భవిష్యత్ ఉద్యమాలు నిర్వహించడానికి ఈ మహాసభలు వేదిక కానున్నాయన్నారు. మీనాక్షి, శ్రీనివాస్, ప్రదీప్, సుమను ప్రియాంక, సుప్రియ, కవిత, అనిత, దేవేందర్, కుమారు, నవీన్, శ్రీకాంత్, రాజేష్, మహేష్, చంటి, రోహిత్, తదితరులు ఉన్నారు.
హసన్పర్తి : ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్షులు మంద శ్రీకాంత్, కాకతీయ యూనివర్సిటీ కార్యదర్శి మూల వేణు కోరారు. సోమవారం కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులతో కలిసి మహాసభ వాల్ పోస్టర్ ను వారు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంద శ్రీకాంత్ మాట్లాడుతూ ఈనెల 14,15,16 తేదీలలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో మహాసభలు జరుగు తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరిస్తుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో మూడు వేల కోట్ల రూపాయల స్కాలర్ షిప్ లు, ఫీజు రీయింబర్స్మెంట్ ఉన్నాయన్నారు. సంక్షేమ హాస్టల్లు కనీసం స్వంత భవనాలు లేక అరకొర వసతులతో అనేక ఇబ్బందుల్లో పేద మధ్య తరగతి విద్యార్థులున్నారని అన్నారు. ఒకే రూమ్ లో 50 మంది విద్యార్థులను పడుకోబెడుతున్న పరిస్థితి నెలకొందన్నారు. కనీసం మూత్రశాలలు, మరుగుదొడ్లు సరిపడలేక విద్యార్థులు అనేక సమ స్యలతో సతమవుతమవుతున్నారన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు పెంచకపోవడంతో విద్యార్థులు చాలీచాలని అన్నంతో అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా రన్నారు. మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. కాకతీయ యూనివర్సిటీ సహాయ కార్యదర్శి మురళీకృష్ణ, శివ, సందీప్, రాజకుమార్, వినరు, నితిన్, తదితరులు పాల్గొన్నారు.