Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
ప్రైవేటు ఎలక్ట్రిషన్లకు రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు వడ్డీ లేని రుణాలను అందించి ఆదు కోవాలని తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రిషన్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గాదెపాక కిరణ్ కోరారు. సోమ వారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ప్రైవేటు ఎలక్ట్రిషన్ల సంఘం మండల అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు కత్తుల వెంకన్న, పసునూరి సురేష్, లైన్స్ క్లబ్ ఆఫ్ పాలకుర్తి మాజీ అధ్యక్షులు వర్రే వెంకన్నతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రైవేట్ ఎలక్ట్రిషన్ల సమస్యల పరిష్కారంతోపాటు, ప్రైవేటు ఎలక్ట్రిషన్లకు మండల కేంద్రంలో భవనాన్ని నిర్మించాలని, దళిత ఎలక్ట్రిష న్లకు దళితబంధు అమలు చేయాలని కోరారు. ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ దళితులకు దళిత బంధు వర్తింప చేయాలని, ప్రమాదవశాత్తు అకాల మరణాలతో పాటు, అంగవైకల్యం సంభవించే ప్రైవేటు ఎలక్ట్రీషి యన్లకు రూ. పది లక్షలు ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. స్పందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... ప్రైవేట్ ఎలక్ట్రిషన్ల సంక్షేమం కోసం భవన నిర్మాణం చేపడుతానని, స్థలాన్ని కేటాయించాలని తహసీల్దార్ భూక్య పాల్ సింగ్ నాయక్‌ను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రైవేటు ఎలక్ట్రిషన్లకు అందేలా కషి చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రైవేటు ఎలక్ట్రిషన్ల సమస్యలను సీఎం కేసీఆర్ దష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల ఆర్గనైజర్ ఎండీ రాజా మహమ్మద్, మండల నాయకులు చెన్నూరు సోమ నరసయ్య, బత్తుల సోమన్న, మచ్చ ఎల్లయ్య, కమ్మగాని సతీష్, కూరపాటి శ్రీకాంత్, యార సంపత్, వెన్న రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.