Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్‌రెడ్డి,కార్యదర్శి పెరుమాండ్ల వెంకట్
నవతెలంగాణ-హన్మకొండ
వరంగల్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు అక్టోబర్ 16న నిర్వహిస్తామని వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్‌రెడ్డి, కార్యదర్శి పెరుమాండ్ల వెంకట్ తెలిపారు. హనుమకొండలోని ప్రెస్ భవన్లో సోమవారం ప్రెస్ క్లబ్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా దాసరి కష్ణారెడ్డి, శేంకేసి శంకర్రావు, బీఆర్ లేనిన్ హాజరు కాగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రెస్ క్లబ్ కు ఎన్నికలు నిర్వహించాలని, ప్రెస్ క్లబ్ మెంబర్ షిప్ రీన్యూవల్స్ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ నెల 15 నుంచి 30 తేదీ వరకు ప్రెస్ క్లబ్ ఆవరణలో ఫామ్స్ ఇస్తారని, ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 2గంటల వరకు ముగ్గురు కమిటీ సభ్యులు అందు బాటులో ఉంటారన్నారు. సభ్యత్వ రుసుం రూ.300 అని తెలిపారు. అక్టోబర్ 1 నుండి 9 వ తేదీ వరకు రీన్యూవల్స్పై త్రిసభ్య కమిటీ మెంబర్లు కష్ణరెడ్డి, లెనిన్, శంకర్ రావుతో పాటు కమిటీ పరిశీలించి ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తుందన్నారు. అక్టోబర్15న జనరల్ బాడీ సమావేశం, కార్యదర్శి నివేదిక, ప్రెస్ క్లబ్ లావాదేవీలపై నివేదిక ఉంటుందన్నారు. అక్టోబర్ 16న ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ స్వీకరణ ఉదయం 10గంటల నుండి 11గంటల వరకు, ఉదయం 11గంటల నుండి 12గంటల వరకు స్కూటీని, ఉదయం 12గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు ఉపసంహరణ, 1గంటల నుండి 5గంటల వరకు పోలింగ్, 6గంటల నుండి లెక్కింపు ఉంటుందన్నారు. అనంతరం ఎన్నికైన కొత్త కమిటీ ప్రకటన ఉంటుందని తెలిపారు.