Authorization
Thu March 06, 2025 02:30:25 am
నవతెలంగాణ-గార్ల
తెలంగాణ రైతు సంఘం(ఏఐకేఎస్)మండల నూతన అధ్యక్షుడు గా బొబ్బా ఉపేందర్ రెడ్డి, కార్యదర్శి గా గడ్డి పాటి రాజారావు ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు వారు మంగళవారం ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రం లోని మంగపతిరావు భవనంలో సోమవారం జరిగిన తెలంగాణ రైతు సంఘం మండల 2వ మహాసభలో నూతన కమిటీ ని జిల్లా కార్యదర్శి శెట్టి వెంకన్న సమక్షంలో ఎన్నుకున్నారు. మండలంలోని రాంపురం చెక్ డ్యాం పై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం కు నిధులు మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని,రైతులకు బ్యాంకు రుణాలు మాఫి చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలని, కౌలు రైతులకు రైతు బంధు వర్తింపజేయాలని, పోడు సాగు దారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని పలు తీర్మానాలను చేశారు. ఉపాధ్యక్షుడుగా కేళోత్ బాల, ధారావత్ బుజ్జి,నాదెండ్ల కోటేశ్వరరావు,ఇస్లావత్ రాము,సహయ కార్యదర్శి లుగా జి వెంకటరెడ్డి, వి.వీరభద్రం, జి.వీరభద్రం, కమిటీ సభ్యులుగా రామా రావు, రామకష్ణ, లీలా, మోహన్, ఎల్లయ్య,వై వెంకటేశ్వర్లును ఎన్నుకున్నారు.