Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళపెల్లి శ్రీనివాస్
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
అర్హులైన లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు అందించి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని జెడ్పి ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండలంలోని భోజ్యా తండాలో లబ్ధిదారులకు ఆసరా పింఛన్లను స్థానిక సర్పంచ్ మాలోతు కాలు నాయక్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా నిరుపేదలకు ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్ల పథకంతో నిరుపేదలు ఆనందంగా జీవిస్తున్నారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.2016 పింఛన్ మొత్తం ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మోడీ పాలించిన గుజరాత్ లోను ఇంత మొత్తం పింఛన్ అందడం లేదని తెలిపారు.ఆసరా పింఛన్ల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. వద్ధులు వితంతువులు దివ్యాంగులు ఒంటరి మహిళలు, పైలేరియా హెచ్ఐవి రోగులు, బీడీ కార్మికులు, నేత,గీత కార్మికులకు ప్రతినెల రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలికట్ట మాజీ సర్పంచ్ దామోదర్ రావు, పంచాయతీ కార్యదర్శి రవి, తండావాసులు పాల్గొన్నారు.