Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు అసెంబ్లీలో సీతక్క
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు జిల్లా కేంద్రాన్ని మున్సిపాల్టీగా చేస్తూ రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టినందుకు ములుగు ఎమ్మెల్యే సీతక్క సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడారు. 2024లో ములుగు పంచాయతీ పదవీకాలం ముగియగానే ములుగు మున్సిపాల్టీ కానుంది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో సీఎం ఇచ్చిన మాట ప్రకారం ములుగు మండలంలోని మల్లంపల్లిని మండలంగా ప్రకటించాలని కోరారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి నిధులు మంజూరు చేయాలన్నారు. కలెక్టరేట్లోనే అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయా లుండేలా ఏర్పాటు చేయాలని కోరారు. ములుగులో బస్ డిపోను, ఏటూరునాగారం మండలాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలన్నారు. ములుగులో విద్యుత్ శాఖ జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలన్నారు.