Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
సెప్టెంబర్ 17 విద్రోహ దినమేనని ఏపీటీఎఫ్ పూర్వ అభ్యర్థులు నరసింహారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణ తరగుతులు మండల కేంద్రం లోని సీపీఐ(ఎంఎల్)న్యూడేమోక్రసీ పార్టీ కార్యాలయంలో మంగళవారం రెండవ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా 1948 సెప్టెంబర్ -17 అనే అంశంపై ఏపీటీఎఫ్ పూర్వ అద్యక్షులు నరసింహారెడ్డి వివరించారు. సెప్టెంబర్-17 పై సుమారు 15 సంవత్సరాల నుండి చర్చ జరుగుతున్నా రాజకీయ ఎత్తుగడలకే ఉపయోగించుకుంటున్నారని అన్నారు. ఖాసీం రాజ్వే అకృత్యాలకు అడ్డు అదుపు లేని సమయంలో విరోచితమైన సాయుద పోరాటంలో 4000 వేలమంది ప్రాణ త్యాగం చేశారన్నారు. 1948-సెప్టెంబర్-17 తర్వాత కమ్యూనిస్టులపై నాటి పటేల్ సైన్యాలు విరుచుకుపడి పారిపోయిన భూస్వాములకు తిరిగి భూములను వారికే అప్పగించారని అన్నారు. నిజాం చివరి రాజుకు సకల సౌకర్యాలు, భారత ప్రభుత్వం కల్పించిందని అందుకే ఇది సెప్టెంబర్-17 విముక్తి కాదు విమోచన కాదు మామ్మాటికీ విద్రోహ దినమేనని అన్నారు. యువజనోద్యమం - - యువకుల కర్తవ్యాలు ఆనే అంశంపై ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ... దేశంలో యువతరం సుమారు 50 కొట్లపైన ఉన్నారని, వారి శక్తిని ఉపయోగించడంలో పాలక వర్గాలు విఫలమయ్యాయన్నారు. సమాజంలో నిరుద్యోగం, ఉపాధి, విద్యతోపాటు, మూఢనమ్మకాలు, మత్తు పదార్థాలు, మత్తుపానియాలు, అశ్లిల, శూద్ర సాహిత్యంపై చైతన్య వంతమైన శాస్త్రీయ దక్పథం గల ఉద్యమాల ద్వారా సమసమాజ నిర్మాణంలో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరదయ్య, పీలైఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఎం. మోతిలాల్, మోకాళ్ళు రమేష్, ధనసరి కుమారి, రణదీర్, తుడుం వీరభద్రం, చైతన్య చంద్రశేఖర్, ప్రభాకర్, సురేష్, సిద్ధీశ్వర్, కుమారస్వామీ, మధు, తదితరులు పాల్గొన్నారు.