Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిడబ్లుఎంసి కమిషనర్ ప్రావీణ్య
నవతెలంగాణ-వరంగల్
పన్నుల సేకరణలో వేగం పెంచి నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని జిడబ్లుఎంసి కమిషనర్ ప్రావీ ణ్య రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళ వారం జిడబ్ల్యూ ఎంసీ ప్రధాన కార్యాల యంలో జరిగిన సమావేశంలో రెవిన్యూ అధికా రులతో సర్కిల్ల వారిగా పన్నుల సేకరణ, ఓ టి ఎస్, భువన్ పురోగతి, పెండింగ్ ఫైల్స్ పై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2022-23 ఆర్థిక సంవత్సరానికి బల్దియా పరిధిలో రూ.88.31 కోట్ల పన్ను వసూలు లక్ష్యం కాగా, ఇప్పటివరకు కేవలం 35.78 కోట్ల రూపాయలు వసూలు చేసారని అన్నారు. ప్రతి ఆర్ ఐ ల వారిగా పక్షం రోజులకు పన్నుల సేకరణ లక్ష్యాన్ని విధించడం జరుతుందని, లక్ష్యాన్ని సాధించని పక్షంలో కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు.100 ఎక్కువ బకాయిదారులపై ప్రత్యేక శ్రద్ధ చూపి పన్నులు వసూ లు చేయాలని తెలిపా రు. ప్రభుత్వం ఆక్టోబర్ 31 వరకు కల్పించిన వన్ టైం స్కీం అవకాశాన్ని నగర పన్ను చెల్లింపుదా రులు సద్వి నియోగం చేసుకో వాలని, ముఖ్యంగా బడా బకాయిదారులు 90 శాతం వడ్డి మాఫీతో పన్ను చెల్లిం చుకొనేలా చైతన్యం కల్పిం చి పన్నులు సేకరిం చాలని అన్నారు. రెవెన్యూ ఆఫీసర్లు ప్రతి రోజు రెవిన్యూ సిబ్బం ది సేకరించిన పన్ను పర్యవేక్షించి నివేదిం చాలని ఆదేశించారు. మహా నగర పరిధిలో ఇప్పటికే 72 శాతం ఇండ్లకు జియో టాగింగ్ జరిగిందని మిగిలిన 28 శాతం జియో టాగింగ్ చేయాలని అన్నారు. క్షేత్ర స్థాయిలో రెవిన్యూ సిబ్బంది కొత్త ఇండ్లను గుర్తించి అస్సెస్మెం ట్, రివైజ్డ్ టాక్స్ వేసి బల్దియా ఆదాయం పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా సిటీజన్ చార్టర్ ను పటిష్ఠంగా అమలు చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు కేటా యింపు, ఆస్తి పేరు మార్పిడి, బైఫర్కేషన్, కొత్త ఆసేస్మెంట్ తదితర వినతులు, సమస్యలను గడువులోగా పరిష్కరించేలా రెవిన్యూ ఆఫీసర్లు, ఉప కమిషనర్ లు పర్యవే క్షిం చాలని అన్నారు. ఈ సమీక్షలో అదనపు కమిషనర్ అనిస్ ఉర్ రషీద్, ఉప కమిషనర్ జోనా, శ్రీనివాస్ రెడ్డి, ఐటీ మేనేజర్ రమెష్, ఆర్ఓ లు సుదర్శన్, యూసుఫోద్దీన్, శ్రీనివాస్, శహజాది బేగం, తదితరులు పాల్గొన్నారు.