Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పోడేటి దయాకర్
నవతెలంగాణ-పర్వతగిరి
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఎస్సై స్రవంతిరెడ్డి దళితులను కులం పేరుతో దూషించడం సరికాదని ఎస్సై సర్వీస్ నుండి ఆమెను వెంటనే తొలగించాలని కేవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు పోడేటి దయాకర్ డిమాండ్ చేశారు. మండలంలోని అన్నా రం షరీఫ్‌లో మంగళవారం అంబేద్కర్ భవనంలో కెవిపిఎస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఒక బాధ్యతగల వత్తిలో ఉండి కులం పేరుతో దూషిం చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా మన్నారు. ఆమెపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి తక్షణమే విధుల నుండి తీసివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు ఆబర్ల యాకరాజు, ఒగ్గు శ్రావణ్, పసులది స్వప్న, చదల ఉప్పలయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా నేలకొండ పల్లిలో దళిత యువకు లను కులం పేరుతో దూషించిన ఎస్సై స్రవంతి రెడ్డి పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్ర మం చేపట్టారు. ఈ సందర్భంగా రెవల్యూషనరీ సోష లిస్ట్ పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి వల్లం దాస్ కుమార్, సిపిఎం మండల కార్యదర్శి మాదాసి యాకూబ్, సిఐటియు మండల కన్వీనర్ జిల్లా రమేష్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి దళిత ఎస్సీ కాలనీలో యువకులను మాదిగ నా కొడుకుల్లారా అంటూ కులం పేరుతో దూషించిన ఎస్సైపైపై తక్షణమే ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి తక్షణమే ఉద్యోగం నుండి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దళిత ప్రజాసంఘాల నాయకులు తాటికాయల నరసయ్య, జేరిపోతుల భాస్కర్ ,జిల్లా రవి, మంద రవీందర్, చిన్న పెళ్లి ఐలయ్య, చిన్న పెళ్లి వెంకన్న, జంగిలి అశోక్, పోలోజు మహేష్, తదితరులు పాల్గొన్నారు.
చెన్నారావుపేట : కులం పేరుతో దూషించిన ఎస్సై పై ఎస్సీ ఎస్టీ యాక్ట్ చట్టం కింద కేసు నమో దు చేయాలని మాల మానాడు జిల్లా అధ్యక్షుడు సాదు నర్సింగరావు అన్నారు. మండల కేంద్రంలోని మాల మహానాడు ముఖ్య కార్యకర్త ల అత్యవసర సమావేశంలో మండల అధ్యక్షుడు కడగండ్ల యాకయ్య ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కోతి విష్ణు జిల్లా కార్యదర్శి కుల మల్ల కమలాకర్ నర్సంపేట మండల అధ్యక్షుడు ఆసోద నర్సింగం దుగ్గొండి మండల అధ్యక్షుడు ఈద విజయేందర్ నెక్కొండ మండల అధ్యక్షుడు బక్కి కుమార్ నాయకులు కోడి కష్ణాకర్ పాల్గొన్నారు.