Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా యాదవ సంఘం నాయకులు
నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లావ్యాప్తంగా మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు జాదురావుపేట చెరువు, శివశంకర్ ప్రాజెక్ట్‌లోని నీటిలో కొట్టుకొని పోయి మతి చెందిన గొర్లకు నష్టప రిహారం చెల్లించి యాదవ కులస్తులను ఆర్థికంగా ఆదుకో వాలని జిల్లా అఖిలభారత యాదవ మహాసభ ఉపాధ్య క్షులు పెంట సదానందం యాదవ్ మంగళవారం ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరు లతో మాట్లాడుతూ గంగారం, దామరకుంట, లక్ష్మీపూర్ గ్రామాలకు చెందిన గొర్ల కాపరులు తమ గ్రామాలకు సమీపంలో ఉన్న అడవిలోకి మేతకు తీసుకొని వెళ్లార న్నారు. ఈ క్రమంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవ డంతో గొర్ల కాపరులు గొర్లను తోలుకొని ఇంటికి వస్తున్న క్రమంలో వర్షం ఎక్కువై జాదరావుపేట చెరువు, శివశంకర్ ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహం పెరిగి గొర్లు వాగు దాటు తుండగా నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయి మతి చెందాయి. అయినప్పటికీ గొర్ల కాపర్లు ప్రాణాలకు తెగించి కొన్ని గొర్లను కాపాడుకున్నారని వివరించారు. జాదరా వుపేట చెరువు, శివశంకర్ ప్రాజెక్టులలో కొట్టుకపోయిన గొర్లు మతి చెందడంతో గొర్ల యాజమాన్యంలో తీవ్రంగా నష్టపోయారని,వారికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిం చి ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా నాయకులు పోలవేన ప్రసాద్ యాదవ్, జాగరి అజరు యాదవ్, పిల్లి వేణు యాదవ్, మామిడి కుమార్ యాదవ్, యాదవ సంఘం జిల్లా యూత్ నాయకులు పోలవేని మహేందర్ యాదవ్, జంఘం తిరుపతి యాదవ్, మేకల రాజు యాదవ్, ఆవుల వంశీ యాదవ్, పాల్గొన్నారు.