Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఖిలావరంగల్
గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు. మంగళవారం సుభాష్ నగర్ లోని 38వ నెంబర్ అంగన్వా డి సెంటర్ లో పోషణ అభియాన్ కార్యక్రమాన్ని ఐసిడిఎస్ సూపర్వైజర్ బత్తిని రమాదేవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లా డారు. గర్భిణులు, బాలింతలు పిల్లలకు ప్రభుత్వాలు ఇస్తు న్న పోషక పదార్థాలు వినియోగించుకున్నట్లయితే శక్తివం తంగా ఉండి ఆరోగ్యంగా జీవించగలుగుతారని పేర్కొన్నా రు. చిన్నప్పటి నుండే పిల్లలు శక్తివంతంగా ఆరోగ్యంగా ఉండటానికి ప్రతినెల ఆరోగ్యశాఖ ద్వారా మెడికల్ చెక్ అప్ జరుగుతుందని, అందులో లోపం ఉన్న వారిని గుర్తించి వారికి వైద్యం చేస్తారన్నారు. ఐసిడిఎస్ సూపర్ వైజర్ బత్తిని రమాదేవి మాట్లాడుతూ ప్రతి సంవ త్సరం సెప్టెం బర్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు ప్రతి అంగన్వాడిలో పోషణ మాసం కార్యక్రమం నిర్వహిస్తార న్నారు. కార్యక్ర మంలో పాల్గొన్న తల్లులకు ఆరోగ్య సూత్రా లతో పాటు ఎటువంటి పోషక విలువలు కలిగిన పదార్థం తినాలో వివరిస్తామని తెలిపారు. అనంతరం కార్పొరేటర్ మరు పల్ల రవి అన్నప్రాసన అక్షరాభ్యాసం చేయించారు. మాజీ కార్పొ రేటర్ మరుపళ్ల భాగ్యలక్ష్మి గర్భిణీ స్త్రీలకు అంగన్వా డిలోకి ఆహ్వానించి పోషక విలువలు కలిగిన పండ్లు ఆహారపదార్థాలను అందించారు. కార్యక్రమంలో అంగన్వా డి టీచర్ బత్తిని సునీత, టీచర్లు ఎస్ స్వప్న, టి నాగమణి, బి భార్గవి, టి వెంకటమ్మ, ఎం విజయలక్ష్మి, ఏ రమాదేవి, ఎం సునీతాదేవి, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.
టేకుమట్ల : గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు, పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు అని ఐసిడిఎస్ సిడిపిఓ అవంతిక అన్నారు. మండలం లోని వెంకట్రావుపల్లిలో సర్పంచ్ నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన మంగళవారం పోషకాహార మాసోత్సవాలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అవంతిక మాట్లాడుతూ కోడి గుడ్లు, పాలు, ఆకుకూరలు ప్రతిరోజు ఆహారంతో పాటు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు పెరుమాండ్ల చంద్రకళ ఐసిడిఎస్ సూపర్వైజర్ సరోజన అంగన్వాడి టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.
కాటారం : మండలంలోని కాటారం గ్రామ పంచాయతీ లోని అన్ని అంగన్వాడి సెంటర్ నిర్వాహకులు అందరూ కలిసి అంగన్వాడి కేంద్రంలో మంగళవారం పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాటారం ఎంపిటిసి జాడి మహేశ్వరి రమేష్, అంగన్వాడి సూపర్వైజర్ అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణు లకు, బాలింతలకు అవగాహన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారని వివరించారు. చిన్నారులు మహిళలతో ప్రతిజ్ఞ చేయిం చారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు శ్యామల, ప్రేమలత, అనసూయ, విమల, అమతరాణి, కష్ణవేణి అంగన్వాడి ఆయాలు, ఆశ వర్కర్లు, తల్లులు, పిల్లలు, కిశోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.
మహదేవపూర్ : మండలంలోని రాపల్లి కోట పలుగుల గ్రామాల్లో మంగళవారం రోజున సిడిపిఓ రాధిక ఆదేశాల మేరకు అంగన్వాడి కేంద్రాలలోగర్భిణీ బాలిం తలకు పౌష్టికాహార ఆహారాల పట్ల అంగన్వాడి టీచర్లు అవగాహన కల్పించారుఅప్పుడే పుట్టిన బిడ్డనుండి ఏ విధంగా ఆహారాల్ను తీసుకోవాలోమరియ్నుఆకుకూరల్లో ఎక్కువ శాతంపోషకాహారాలు ఉంటాయని వివరించారువారు తయారు చేసిన పోషకాహారాలను ్గగర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు చూపించే విధంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ రాజక్క సమ్మయ్య, మానం లస్మయ్య ఉపసర్పంచ్ లస్మయ్య ఉపసర్పంచులు బట్టి శ్రీశైలంమచ్చ వెంకటేశ్వర్ పల్లి కోట హెచ్ఎం మేడి ప్రకాష్వార్డ్, మెంబర్ సురేష్ అంగన్వా డి టీచర్లు పి శ్రీదేవి శైలజ ఉమామహేశ్వర్ తిరుపతమ్మ ఆయలుతదితరులు పాల్గొన్నారు.