Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యులు, సిబ్బంది పట్ల నిర్లక్ష్యం
- కొంతమంది సిబ్బందితోనే లావాదేవీలు
- ప్రశ్నించే వారికి ఆబ్సెంట్, ప్రశంసిస్తే ప్రజెంట్
- ఆసుపత్రి నిధుల ఖర్చుపై విచారణ చేపట్టాలి
నవతెలంగాణ-ములుగు
జిల్లా ఆస్పత్రిలో ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఒకరిద్దరు వైద్య, సిబ్బందిని వెనుకేసుకుని ఆరోగ్యశ్రీ నిధులను, అభివద్ధి నిధులను ఎవరి ని లెక్కచేయకుండా ఖర్చు చేస్తుంటే ప్రశ్నించే వారికి గైర్హాజర్ వేస్తూ డ్యూటీకి రాకుండా ఉన్న కొంతమందికి హాజరు వేస్తూ ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నాడని ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది ఆవేదనతో గుసగుసలా డుతున్నారు. కొంత మంది చెప్పిన మాటల్లో...వైద్య సిబ్బందికి రావల్సిన ఆరోగ్యశ్రీ డబ్బులు ఉద్యోగి పేరున డబ్బులు ఇంతవరకు ఇవ్వకపోవడం, తనకు నచ్చిన ఉద్యో గుల పేరున రూ.50 వేల నుంచి రూ. 1 లక్ష వరకు వారి ఖాతాల్లో ఆసుపత్రి ఖా తా నుండి జమ చేశారు. కొంత మంది డాక్టర్లు, సిబ్బంది ఇదేంటని ప్రశ్నిస్తే తిరిగి వారి అకౌంట్ నుండి మళ్లీ ఆసు పత్రి అకౌంట్లోకి వేయండని బెదిరింపులతో వేయిం చుకో వడం జరుగుతుందన్నారు. ఇలా లావాదేవీలు యూని యన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్‌ల నుండి జరుగుతున్నాయని అవస రమైతే అకౌంట్లు పరిశీలిస్తే సూపరింటెండెంట్ బాగోతం అంతా బయట పడుతుందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇదేంటి అని ఉద్యోగులను అడిగితే నిన్ను తీసివేస్తా అని బెదిరిస్తున్నారన్నారు. తనకు నచ్చిన వారితో కలిసి గంటలు గంటలు సీసీ కెమెరా లేని గదిలో కూర్చొని ఉద్యోగులతో భోజనాలు చేయడం, ఎప్పుడూ సూపరింటెండెంట్ గదిలోకి వెళ్లిన ఒక సభ లాగా ఉంటుందన్నారు. ఆసుపత్రిలో సీసీ కెమెరాలు నిఘాల్లో ఉంటే సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరాలు ఎందుకు లేవని, మీరు నడిచి పోయేదారుల్లో కూడా సిసిలు ఎందుకు లేదో చెప్పాలని సిబ్బంది వాపో తున్నారు. పేషెంట్ల కోసం ఏర్పాటు చేసిన ఏసీలు వీరి రెస్ట్ రూమ్‌లో ఎందుకని, ఈ మధ్యనే ఓ డాక్టర్ ఈ విషయంలో తీవ్రస్థాయిలో ఘర్షణ పడినట్లు తెలిసింది. ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్ దాదాపు రూ.90 లక్షలు, హెచ్‌పీఎస్ ఫౌండ్, సిటీ స్కాన్ ఒక కోటి రూపాయలతో ఏమి అభివద్ధి జరిగిం దని చూపించాలని, ఈ నిధులు అవకతవకలు అయినట్లు సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈ మధ్యనే ఆయన స్టాఫ్ నర్స్ సెల క్షన్లో ఏటునాగారంలో ఒక్క నర్స్ కేసవేయడం, నాన్ లోకల్ వాళ్లను ఔట్ సోర్సింగ్‌లో తీసుకోవడం ఇష్టం వచ్చిన వారిని అందలం ఎక్కించడం జరుగుతుందన్నారు. ప్రశ్నిస్తే మీరు ప్రజా ప్రతినిధుల, మీడియా ప్రతినిధుల ఎవరైతే నాకేంటి అని దురుసుగా మాట్లాడినట్టు తెలిసింది. ఈ మధ్య ఎంపీపీ ఆకస్మిక తనిఖీ చేసి ఉద్యోగుల సమాచారం అడిగి తెలుసుకున్నారు. కొంతమంది డాక్టర్లు వచ్చిన రాకున్నా వారిని ఏమీ అనకపోవడం కొంతమంది డాక్టర్లు డ్యూటీలు చేసిన వారిని మందలించడం వారిని మూడు రోజులు వచ్చి న డాక్టర్లపై చర్య తీసుకో కుండా డ్యూటీ చేసే మాపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నా రని డాక్టర్లు బహిరంగానే చర్చించుకుంటున్నారు. ఈ మధ్యనే కొందరి డాక్టర్లకు గైర్హాజర్ వేసి వారి జీతాలు కూడా కట్ చేశారని, మరి డ్యూటీ రాని వారికి జీతం ఇచ్చి మాకు ఎందుకు జీతాలు కోత విధించారని వారు ప్రశ్నించినట్లు తెలిసింది. కొందరికి డిప్యూటేషన్ నచ్చని వారిని ఇచ్చి డిప్యూటేషన్‌పై పోయే వాళ్లను రిలీజ్ చేయకుండా ఆపడం అతని తీరు క్రింది స్థాయి ఉద్యోగుల నుండి పై స్థాయి ఉద్యోగుల వరకు అసంతప్తితో విసుగు చెందుతున్నట్లు చర్చించుకుం టున్నారు. కానీ డాక్టర్లు, నర్సులు మిగిలిన సిబ్బంది ముం దుకు వచ్చి మాట్లాడడానికి జంకుతున్నారు. ఈ మధ్యనే శానిటేషన్, కాంట్రాక్ట్‌లో సిబ్బందిని కొన్ని రోజులుగా చాలా బాధ పెట్టారని, వంద పడకల ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రి 75 పడకలే ఉన్నాయని మిమ్మల్ని ఎనిమిది మందిని తీసే స్తానని ఆయన బెదిరించగా వారు మమ్ములను తీసేయద్దని కాళ్లా ఏళ్లా పట్టుకుని ఈ జీతాలు లేకున్నా వెట్టిచాకిరి చేస్తున్నారని తెలిసింది. గత మూడు నెలల నుండి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వాళ్లకు జీతాలు లేవని, మాకు తగిన విధంగా జీతాలు ఇస్తే మేము పనిచేస్తేనే కదా పెద్ద వాళ్ళకు పేరు వచ్చేదని కింది స్థాయి ఉద్యోగులు వా పోతున్నారు. ఇప్పట ికైనా సూపరింటెండెంట్ పద్ధతి మార్చుకొని వైద్య సిబ్బంది రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా కృషి చేసి, సిబ్బందికి రావాల్సిన అలవెన్సులు, జీవితాలు సక్ర మం గా అదే విధంగా చూడాలని, అందరి వైద్య సిబ్బందిపై ఒకే తరహాలో వివక్ష లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. జిల్లా ఆసుపత్రి పై ఉన్నతాధికారులు నిఘా పెట్టి వైద్య సిబ్బంది రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించాలని, నిధులను సక్రమంగా వినియోస్తున్నరో లేదో తనిఖీలు చేయాలని వారు కోరుతున్నారు.