Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్
నవతెలంగాణ-గోవిందరావుపేట
దేశంలో పాలక ప్రభుత్వాలు యువతను యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నాయని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్య దర్శి అనగంటి వెంకటేష్ అన్నారు. మంగళ వారం మండలంలోని పస్రాలో డివైఎఫ్ఐ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం ప్రజాసంఘాల కార్యాలయంలో అధ్యక్షులు జాగట్టి చిన్న అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో లక్షల్లో కోట్లలో ఉన్న యువతను ప్రభుత్వాలు సరిగ్గా విని యోగించుకోకుండా వారికి ఇవ్వాల్సిన ప్రాధా న్యత ఇవ్వకుండా యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నా యన్నారు. దీంతో యువకులు ఏ పని లేక నిరుద్యో గులుగా రోడ్లమీద తిరగాల్సి వస్తుందని, కుటుంబ అవసరాలు అయితే ప్రైవేటు కార్పొరేట్ సంస్థలలో తక్కువ వేతనాలకు ఉద్యోగాలు చే స్తూ వెట్టి చాకిరి శ్రమ దోపిడీకి గురవుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న యువత మతంకు మద్యంకు బానిసై జీవితాలు ఆగం చేసుకుం టు న్నార న్నారు. ఇచ్చిన నోటిఫికేషన్ అన్ని అమలు జరిపే త్వరగా రాష్ట్ర వ్యాప్తం గా ఉన్న ఖాళీల న్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల డివై ఎఫ్ఐ ఆధ్వర్యంలో యువతను సమీక రించి ప్రభుత్వ అసమర్ధ విధానాలను వివరించి ఆందోళన పోరా టాలు ఉదతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్ర మంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీ ణ్ నాయకులు సంజీవ రవీందర్ రాజేష్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.