Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2030 నాటికి స్థిరమైన గ్రామాల రూపకల్పన లక్ష్యంగా ప్రభుత్వ చర్యలు
- అదనపు కలెక్టర్ దివాకర
- 9 విభాగాల్లో గ్రామపంచాయతీ పనితీరు పరిశీలన
నవతెలంగాణ-భూపాలపల్లి
జాతీయ పంచాయతీ అవార్డులు మన జిల్లాకు అధికంగా అందే విధంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ దివాకర సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతీయ పంచాయతీ అవార్డుల దరఖాస్తు తదితర అంశాలపై మంగళవారం ఇల్లందు క్లబ్ హౌస్లో నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. మన జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించి ఆదర్శ గ్రామాల రూపకల్పనకు కట్టదిట్టమైన చర్యలు చేపట్టామని, జాతీయ పంచాయతీ అవార్డుల దరఖాస్తు సమయంలో మనం చేసిన పనులను పటి ష్టంగా తెలిసే విధంగా డాక్యుమెంటేషన్ చేపట్టాలని అధికారులకు సూచించారు. 2030 నాటికి దేశ వ్యాప్తంగా స్థిరమైన గ్రామాలను రూపొందిం చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం 9 విభాగాల్లో గ్రామపంచాయతీ పనితీరు పరిశీలించి అవార్డుల జారీ ప్రక్రియ చేపట్టిందని ఆదనపు కలెక్టర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి అంశానికి సంబంధించి గ్రామాల పనితీరు బేరీజు వేసుకునే వీలుగా ప్రతి విభాగంలో ప్రశ్నలను సిద్ధం చేసుకుందని, వాటి ఆధారంగా గ్రామాలలో క్షేత్రస్థాయి పరిశీలన చేసి అవార్డుల జారీ ఉంటుందని తెలిపారు. 9 విభా గాలలో పనితీరు ఆధారంగా అక్టోబర్ 31 నాటికి మండల స్థాయిలో ఉత్తమ గ్రామాలను, 16 డిసెం బర్ నాటికి జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామాలను, 31 జనవరి నాటికి రాష్ట్ర స్థాయిలో, 15 మార్చినాటికి జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామాల ఎంపిక జరుగుతుందన్నారు. ఏప్రిల్ 1,2023 న జాతీయ స్థాయి అవార్డుల డిక్లరేషన్ జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ప్రతి విభాగంలో అద్భుత పనితీరు కనబరిచామని, అవార్డుల దరఖాస్తు ప్రక్రియలో, క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో, ప్రశ్నలకు సమాధానం అందించే సమయంలో అప్రమత్తంగా ఉంటూ అధిక సంఖ్యలో జిల్లాకు అందే విధంగా పనిచేయాలని అధికారులకు అదనపు కలెక్టర్ సూచించారు. జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఉత్తమ గ్రామాలను ఎంపిక చేసే సమయంలో మండల జిల్లా పర్ఫామెన్స్ అసెస్మెంట్ కమిటీలు అప్రమత్తంగా ఉంటూ మంచి గ్రామాలను ఎంపిక చేయాలన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన గ్రామాల్లో అద్భుత ప్రగతి సాధించామని, వాటిని కట్టుదిట్టంగా ప్రెసెంట్ చేసి అధిక అవార్డులు సాధించేలా కషి చేయాలని అధికారులకు సూచించారు. జెడ్పీ సిఈఓ శోభారాణి, జిల్లా గ్రామీణ అభివద్ధి అధికారి పురుషోత్తం, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, డి.ఎం.హెచ్.ఓ. శ్రీరామ్, డి.ఏ. ఓ. విజరు భాస్కర్, సి.పి.ఓ. శామ్యూల్ ఎం.పి.డి. ఓ.లు, మెడికల్ ఆఫీసర్లు, ఏ.పి.ఎం.లు, సంబం ధించిన అధికారులు పాల్గొన్నారు.