Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరితగతిన ఆర్ అండ్ ఆర్ కాలనీ ని భూనిర్వాసితులకు అందిస్తాం
- తాడిచెర్ల లింక్ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
- జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ప్రతిపాదనలు
నవతెలంగాణ-భూపాలపల్లి
అర్హులైన భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా సంపూర్ణ చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. మంగళవారం ఆర్డిఓ కార్యాలయం లో జెన్ కో,డిస్కం భూ నిర్వాసితులకు పరిహారం పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొంత కాలంగా పెండింగ్ లో ఉన్న భూ నిర్వాసితుల పరిహారం సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని, 268 మంది అర్హులను మల్హర్ రావు మండలం తాడిచెర్ల, కాపురం గ్రామాల్లో 2 దశలో గుర్తించి, ప్రతి ఒక్కరికీ రూ.7.61 లక్షల పరిహారం అందించామని కలెక్టర్ పేర్కొన్నారు. ఆర్ అండ్ ఆర్ కింద సూప్రిం కోర్టు మార్గ దర్శకాల ప్రకారం ప్రతి కుటుంబానికి 2 గుంటల భూమి, సిసి రోడ్లు, అంగ న్వాడి, కమ్యూ నిటీ హాల్ దేవాలయం, పాఠశాల నిర్మాణానికి అవసరమైన భూ కేటాయింపులు త్వరిత గతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఆర్ అండ్ ఆర్ కాలనీలో ప్రభుత్వం మౌలిక వసతులు కల్పన కోసం రూ.4.5 కోట్లు మంజూరు చేసిందని, టెండర్లు ప్రక్రియ చేపట్టామని పేర్కొ న్నారు. 3 నెలలో కాంపౌండ్‌వాల్, త్రాగునీరు, విద్యు త్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ సంబంధిత అధికా రులకు ఆదేశించారు. భూ నిర్వాహసితులకు సంబం ధించి గతంలో మైనర్లుగా ఉండి ప్రస్తుతం మేజర్లు అయినా 71 మంది లబ్ధిదారులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు. తాడిచర్ల ప్రాంతంలో ఏ.ఎం.ఆర్ సంస్థ మే మాసంలో లింక్ రోడ్డు నిర్మా ణం చేపడతామని తీర్మానించినప్పటికీ పనులు పూర్తి కాకపోవడం పట్ల కలెక్టర్ అసంతప్తి వ్యక్తం చేశారు. ఎం.పి.పి కార్యాలయంలో నిర్వహించిన సమా వేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశింఛారు. అనంతరం భూని ర్వాసితులు కలెక్టర్, ఆర్.డి.ఓ లను శాలువాతో సన్మానించి వారి అభిమానాన్ని చాటుకు న్నారు. భూపాల్పల్లి ఆర్.డి.ఓ. శ్రీనివాస్, మల్హర్ రావు మండల తాసిల్ధర్ దివాకర్‌రెడ్డి, భూ నిర్వాసితుల కమిటీ ప్రతినిధి డి.రమేష్, మల్హర్ రావు, ఎంపీపీ, తాడిచెర్ల ఎంపిటిసి, జెన్కో ఎస్ ఈ తిరుపతయ్య, ఏఎంఆర్ కంపెనీ ప్రతినిధి మల్లేష్, మూర్తి, సంబం ధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.