Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
రాష్ట్రంలో విద్యా రంగ పరిరక్షణకు భవిష్యత్ విద్యార్థి పోరాటాల రూపకల్పనకు ఈనెల 14 15 16న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాలుగవ మహాసభలు జరుగుతాయని ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ డివిజన్ కార్యదర్శి గుగులోతు సూర్య ప్రకాష్ అన్నారు. మహాసభలు జయప్రదం చేయాలని బుధవారం మహబూబాబాద్ లో ఈదుల పూసపెళ్లిబికేసముద్రం ప్రధాన రోడ్డు పై గోడ పత్రికలు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సూర్య ప్రకాష్ మాట్లాడుతూ... 5 లక్షల 12 వేల మంది విద్యార్థుల సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న 600 మంది ప్రతినిధులతోటి మూడు రోజుల పాటు కరీంనగర్ పట్టణ కేంద్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికై, విద్యా రంగంలో జరుగుతున్న మార్పుకు రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉద్యమాలు రూపకల్పన ఈ మహాసభలో చర్చిస్తామని అన్నారు. మాజీ జాతీయ నాయకులు శివ దాస్, జాతీయ అధ్యక్ష కార్యదర్శులు సాను, మయూఖ్ బిస్వాస్ హాజరు అవుతారని అన్నారు. జిల్లా నాయుకులు బానోత్ సింహాద్రి, రూరల్ మండల కన్వీనర్ అజ్మీరా ప్రవీణ్, గుగులోత్ రంజిత్, మహేష్,తరుణ్, సందీప్, దీక్షిత్,మహేందర్,విష్ణు, మనోజ్ వరుణ్ తదితరులు పాల్గొన్నారు.