Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చెన్నారావుపేట
ప్రభుత్వ నిషేధ గుట్కా అంబర్ ప్యాకెట్లు అమ్ముతే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ సంపత్ రావు తెలిపారు. బుధవారం మండలంలోని కోనా పురం గ్రామంలో అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి అన్నబోయిన నాగరాజ్ , వెల్ది సారంగం ఇండ్లలో 55,480 విలువైన గుట్కా అంబర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ హథిరాం తెలిపారు. ఏసిపి మాట్లాడుతూ,మనిషి ప్రాణానికి హానికరమైన గుట్క అంబర్ ప్యాకెట్లు నిర్మూలించడం అందరి బాధ్యత అన్నారు. గుట్కా అంబర్ ప్యాకెట్లను విక్ర యిస్తే పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగు తుందని హెచ్చరించారు. దాడుల్లో ఎస్ఐ తోట మహేందర్, కానిస్టేబుల్ పాల్గొన్నారు.