Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగర మేయర్ గుండు సుధారాణి,కమిషనర్ ప్రావీణ్య
నవతెలంగాణ-వరంగల్
మహా నగర సమగ్రాభివృద్ధికి చేపడుతున్న పనులను సకాలంలో పూర్తిచేయాలని నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య అధికా రులను ఆదేశించారు.బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో స్మార్త్ సిటీ, బల్దియా ఇంజనీరింగ్ అధికారులతో వివిధ అభివృద్ధి పనుల ప్రగతి పై సమీక్షించి పలు సూచనలు చేశారు. అభివృద్ధి పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సురక్షితమైన భద్రత చర్యలు చేపట్టాలని గతంలో పలుమార్లు సమావేశాలు నిర్వహించి అధికారులకు, గుత్తేదా రులకు అదేశిచినా ఇటీవల దుర్ఘటన జరిగి ఇద్దరి ప్రాణాలు పోయాయని అన్నారు. భవిష్యత్తు లో పునరావృత్తమైతే కఠిన చర్యలు తప్పవని ఆదేశించారు. పట్టణ ప్రగతి ద్వారా ప్రతి డివిజన్‌కు రూ.50 లక్షలు కేటాయించినందున 66 డివిజన్ల కార్పొ రేటర్లు అభివృద్ధి పనుల ప్రతిపాదనలు సమర్పిం చాలన్నారు. ఎస్సి సబ్ ప్లాన్ కింద పలు డివి జన్లలో మంజూరైన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని వార్డులలో సక్ర మంగా నీటి సరఫరా జరిగేలా చూడాలన్నారు. డబుల్ కనెక్షన్ సమస్య పరిష్కరిస్తూ, కొత్త గృహ, కమర్షియల్ కనెక్షన్లను మంజూరు చేయాలని కోరారు. సర్వే నిర్వహించి కమ ర్షియల్ నల్లాల ను గుర్తించి బల్దియా రెవెన్యూ పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్మార్ట్ సిటీ పథకం కింద కొన సాగుతున్న ప్యాకేజ్ వన్, ప్యాకెజ్ 2 రోడ్లు, ఎస్టిపి, ఎఫ్ ఎస్టిపి, జంక్షన్ల ఏర్పాటు పనులను సమీక్షించి, పనులలో వేగం పెంచి నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మహానగరంలో చేపడు తున్న 7 ప్రధాన జంక్షన్ల విస్తరణ, సుంద రీకరణ పనులు పూర్తి చేయాలన్నారు. ఈనెల 25 నుండి బతుకమ్మ సంబరాలు ప్రారంభమవుతున్న నేపథ్యం లో ఎలాంటి అసౌక ర్యాలు కలుగకుండా సంబం ధిత పనులు పూర్తి చేయాలన్నారు.
రక్తదాన శిబిరం పోస్టర్ ఆవిష్కరణ
మిలాద్-ఉల్-నభి (మహమ్మద్ ప్రవక్త జన్మదినం) పర్వదినాన్ని పురస్కరించుకొని అంజుమన్-ఈ-హైదర్ వెల్ఫేర్ సొసైటీ అద్వర్యం లో 30 న నిర్వహించనున్న రక్తదాన శిబిరానికి సంబంధించిన పోస్టర్‌ను కమిషనర్ ప్రావీణ్యతో కలిసి మేయర్ బుధవారం సమావేశ మందిరంలో అవిష్కరించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ దర్గా హాజరత్ అబ్దుల్ నబీ సాహెబ్ సవెరా, అశోక హౌటల్ హన్మకొండ ప్రాంతం వద్ద రక్త దాన శిభిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కల్పలత సూపర్ బజార్ వైస్ చైర్మన్ షఫీ, అధ్యక్షులు మహమ్మద్ ఒమర్ పాషా, జనరల్ సెక్రటరీ మహమ్మద్ ఆన్సర్ షా ఖాద్రి, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ తౌసిఫ్, మహమ్మద్ రఫియోద్దీన్ హర్మాని, మహమ్మద్ సాదీర్ పాషా, తదితరులు పాల్గొన్నారు.