Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
వామపక్షాలు పోరాడి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే చూస్తూ ఊరుకోమని వ్యకాస జిల్లా కార్యదర్శి అలవాల వీరయ్య అన్నారు. మండల కేంద్రం లోని వర్తక సంఘం భవనంలో కుంట రామకష్ణ అధ్యక్షతన బుధవారం జరిగిన మండల మహసభలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసి కార్పొరేట్ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయ రంగంలో యాంత్రికరణ ప్రవేశించడం,గ్రామాలలో చేతి వత్తులు దెబ్బతినడం వల్లన వ్యకాస కూలీలకు కూలీ దొరికే పరిస్థితులు లేవని ఆవేదన వెలిబుచ్చారు. 2014 నుండి ఇప్పటి వరకు పెట్రోల్, డిజిల్, గ్యాస్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు రెట్టింపు అయ్యాయని, వీటికి అనుగుణంగా రోజు వారి కూలి రూ.600 ఇవ్వాలన్నారు. కేరళ లో వామపక్ష ప్రభుత్వం మాదిరిగా రేషన్ దుకాణాల ద్వారా 16 రకాల నిత్యావసర వస్తువులు అందించాలని కోరారు. కరోన లాంటి క్లిష్టమైన పరిస్థితులలో కేరళ ప్రభుత్వం కుటుంబాలకు నెలకు రూ.7500 చొప్పున 6 నెలల పాటు అందిస్తే తెలంగాణ ప్రభుత్వం కేవలం రెండు నెలలు మాత్రమే అది అతితక్కువ చెల్లించి చేతులు దులుపుకుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంతో సంబంధం లేని బీజేపీ తామే నిజమైన వారసులుగా చెప్పుకోవడం సిగ్గు చేటని మండిపడ్డారు. భూమి లేని కూలీలకు కూలీబంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, కౌలు రైతు రక్షణ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం అధ్వర్యంలో నిర్వహించనున్న భూ పోరాటాలు, కూలీ పోరాటాలలో వ్యవసాయ కూలీలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ముందుగా సంఘం జెండా ను కార్యదర్శి వంగూరి వెంకటేశ్వర్లు ఆవిష్కరించి, సభలో మూడు సంవత్సరాల పాటు నిర్వహించిన కార్యక్రమాల నివేదిక ను ప్రవేశ పెట్టారు. జిల్లా నాయకులు మండా రాజన్న, వివిధ ప్రజా సంఘాల నాయకులు గడ్డి పాటి రాజారావు, కె.శ్రీనివాస్, కె.కవితా, బి.హరి, యం.గిరిప్రసాద్, ఈశ్వర్ లింగం,సిహెచ్. ఎల్లయ్య, ఐ.గోవింద్, మండల నాయకులు, తదితరులు ఉన్నారు.