Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించి జయప్రదం చేయాలని స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి కోరారు. బుధవారం కలెక్టర్ కార్యా లయంలో కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అధ్యక్షతన నిర్వ హించిన సమీక్ష సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వ హించనున్నట్టు తెలిపారు. వజ్రోత్సవాల విజయవంతానికి ప్రతి నియోజక వర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియ మించామని, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తనా చర్యలు తీసుకునేలా ప్రణాళికలు ఉండాలన్నారు. ఈ నెల 16న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు లాంఛనంగా ప్రారంభమవుతాయని, ఆ రోజు నియోజకవర్గాల వారీగా 15వేలమందితో ర్యాలీలు నిర్వహిం చనున్నట్లు చెప్పారు. ర్యాలీలో ప్రజాప్రతినిధులు, అధికా రులు, ఉద్యోగులు, మహిళా సమాఖ్య ఉద్యోగులు, అంగ న్వాడీ కార్యకర్తలు జాతీయ జెండాలతో పాల్గొనేలా చూడా లన్నారు. హిందూ కోసము పదివేల చిన్న 50 పెద్ద జెండా లను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. సమా వేశానికి వచ్చిన వారందరికీ అక్కడే భోజనం ఏర్పాట్లు చేయా లని ఆదేశించారు. 17న జిల్లా హెడ్ క్వార్టర్స్ లో జాతీయ జెండా ఆవిష్కరణ ఉంటుందని, అదే రోజు హైదరాబాదులో బంజారా భవన్, సేవాలాల్ భవన్ లను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని, అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో పబ్లిక్ మీటింగ్ ఉంటుందన్నారు. 18న జిల్లా కేంద్రంలో సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని వివరించారు. అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జడ్పీ సీఈవో విజయలక్ష్మి, జనగామ ఆర్డిఓ మధుమోహన్, డిఆర్డిఓ రామ్ రెడ్డి, జిల్లా రైతుబంధు అధ్యక్షులు రమణా రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ భాగ్యలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ పాల్గొన్నారు.
వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం
తెలంగాణ జాతీయ సమైక్యత ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ సి.హెచ్. శివలింగయ్య తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తెలంగాణ జాతీయ సమైక్యత ఉత్సవాల నిర్వహణ తీరును జిల్లా కలెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ 17న గిరిజన ఉద్యోగులు ప్రజా ప్రతి నిధులను పంపించేందుకు బస్సులను ఏర్పాటు చేస్తూ ఎస్కార్ట్ ఆఫీసరులను వెంట ఉంచాలన్నారు. పోస్టర్లతో ప్రచారాన్ని చేపట్టాలని సూచించారు. డిసిపి సీతారామ్, ట్రాన్స్పోర్ట్ అధికారి శ్రీనివాసరావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్, ఆర్డిఓ మధుమోహన్, డి డబ్ల్యూ ఓ జయంతి, పాల్గొన్నారు.
వజ్రోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
వరంగల్ : జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రొత్సవా లను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ లు, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్ధేశం చేశారు. జిల్లా నూతన కలక్టరేట్ వీడియో సమావేశ మందిరంలో నిర్వహించి సమావేశంలో సోమేష్ కుమార్ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ముఖ్య మైన భవనాలు ట్రై కలర్ లైటింగ్ ఏర్పాటు చేయా లని ఆదేశిం చారు. జిల్లా కలెక్టర్ గోపి, తదితరులు పాల్గొన్నారు.
అత్యంత వైభవంగా.. : ఎమ్మెల్యే, కలెక్టర్
వర్ధన్నపేట : తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను పండగ వాతారణంలో వైభవంగా నిర్వహించనున్న వజ్రోత్సవ వేడుకలను ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పిలుపునిచ్చారు. వర్దన్నపేట నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల ఏర్పాట్లను బుధవారం వరంగల్ జిల్లా కలెక్టర్ గోపితో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం వర్దన్న పేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ గోపి, అధికా రులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. జాయింట్ కలెక్టర్ శ్రీవత్సవ, డీసీసీబీ చైర్మన్ మార్నెని రవీందర్ రావు, ఏసీపీ నరేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
జయప్రదం చేయండి : ఎమ్మెల్యే పెద్ది
నర్సంపేట : ఈ నెల 16,17,18న మూడ్రోజుల పాటు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైఖ్యత వజ్రోత్సవాలను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు. 16న వజ్రోత్సవాలు లాంఛనంగా ప్రారంభకానున్నాయని నియోజకవర్గ వ్యాప్తంగా 15వేల మందితో ఆర్అండ్బీ గెస్టు హౌజ్ నుంచి మార్కెట్ వరకు ర్యాలీ చేపడుతామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, యువకులు ప్రజలను ఈ ఉత్సవాలలలో భాగస్వామ్యులు అయ్యేలే చూడాలన్నారు.
జన సమీకరణకు కృషి చేయాలి : జెడ్పీటీసీ
పర్వతగిరి : ఈనెల16న వర్దన్నపేటలో జాతీయ సమైక్య వజ్రోత్సవాల ర్యాలీ కై అధిక సంఖ్యలో జనసమీకరణ కు ముఖ్య కార్యకర్తలు కషి చేయాలని జడ్పీటీసీ బానోతు సింగులాల్ అన్నారు. మండల కేంద్రం లోనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశానికి టీఆర్ఎస్ మండల అద్యక్షులు రంగు కుమార్ అద్యక్షతన జడ్పీటీసీ పాల్గొని మాట్లాడారు. ఈ ర్యాలీ కి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మాజీ జడ్పీ టీసీలు మేడిశెట్టి రాములు,పంతులు నాయక్, పర్వతగిరి సొసైటీ చైర్మన్ మనోజ్ కుమార్,జిల్లా కో ఆప్షన్ సభ్యుడు మహమ్మద్ సర్వర్ తదితరులు పాల్గొన్నారు.
విజయవంతం చేయండి : జెడ్పీటీసీ
జఫర్గడ్ : స్టేషన్గన్పూర్ నియోజకవర్గంలో జరుగు సెప్టెంబర్ 16 బహిరంగ సభ, వజ్రోత్సవాలను విజయ వంతం చేయాలని జెడ్పిటిసి ఇల్లందుల బేబీ శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జెడ్పీటీసీ మాట్లాడారు.
జయప్రదం చేయాలి : ఎంపీపీ
లింగాలఘనపురం : సెప్టెంబర్ 16నుండి18తేదీ వరకు జరుగనున్న తెలంగాణ జాతీయ సమైక్యతా ఉత్సవాలను జయప్రదం చేయాలని ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉత్సవాల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంపీపీ ల ఫోరం జిల్లా అధ్యక్షురాలు, ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. మండల స్పెషల్ ఆఫీసర్ లత, ఎంపీడీఓ మల్లికార్జున్,తహసీల్దార్ అంజయ్య, ఎస్ఐ రఘుపతి, తదితరులు పాల్గొన్నారు.
విజయవంతం చేయాలి : ఎంపీపీ
పాలకుర్తి : రాష్ట్ర జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఈనెల 16న నిర్వహించే జాతీయ సమైక్యత సభను మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీపీ నల్ల నాగిరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏపీఎం రమణాచారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల, గ్రామైక్య సంఘాల సమావేశంలో ఏపీడీ నూరోద్దీన్, జెడ్పి ఫ్లోర్ లీడర్ శ్రీనివాసరావు, ఎంపీడీవో అశోక్ కుమార్తో కలిసి ఆయన మాట్లాడారు. డీపీఎం సమ్మక్క, రాష్ట్ర జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల ఇన్చార్జి ఏపీఎంలు కే.వెంకట్ రెడ్డి, పి నరేందర్ సీసీలు వెంకటేశ్వర్లు, వెంకటయ్య, శోభ, అనురాధ, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.