Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖిలావరంగల్
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వం కమ్యూనిస్టుల దేనని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ అన్నారు. ఆ పోరాటంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ల పాత్ర శూన్యమని తెలిపారు. సీపీఐ(ఎం) కరిమాబాద్ ఏరియా కార్యదర్శి ముక్కెర రామస్వామి అధ్యక్షతన రాశికుంట వద్ద వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వ విశిష్టతపై ప్రజలకు బుధవారం వివరించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. 1946 నుండి 1951 వరకు నిజాంకు కు వ్యతిరేకంగా, విసునూరు రామచంద్రారెడ్డి కి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 5 సంవత్సరాలపాటు సాగిందన్నారు. ఆ పోరాటంలో 10లక్షల ఎకరాల భూములను ప్రజలకు పంచిన ఘనత కమ్యూనిస్టుదేనన్నారు. పదివేల గ్రామాలను విముక్తి చేసిన చరిత్ర ఎర్రజెండా కే ఉందన్నారు. ఈ పోరాటంలో విసునూరు దేశముఖ్, నిజాముకు చెమటలు పట్టాయన్నారు. దాన్ని గమనించి కేంద్ర ప్రభుత్వం హౌం మంత్రి సర్దార్ వల్లభారు పటేల్ ను తెలంగాణ ప్రాంతానికి పంపించి నిజాము తోనే ఒప్పందం కుదుర్చుకుని కమ్యూనిస్టు పోరాటాల్ని అణచి వేసిందన్నారు. తెలంగాణను భారత ప్రభుత్వం లో 1948 సెప్టెంబరు 17న విలీనం చేశారన్నారు. జిల్లా కార్యదర్శి రంగయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ పోరాటాన్ని విలీనం దీనంగా పిలవాలని సీపీఐ(ఎం) పిలుపునిచ్చిం దన్నారు. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం విమోచన దినం అనడంలో అర్థం లేదన్నారు. బిజెపి ప్రభుత్వం విమోచన దినం అని హిందూ, ముస్లింల మధ్య అధికారమే ధ్యేయంగా ప్రజల మధ్య చిచ్చు పెట్టడం మంచిది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి కోటి ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయా లన్నారు. వ్యవసాయాన్ని కార్పొరేట్లకు అప్పగించ రాదన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రజలంతా పోరాటాలలో కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. గున్నాల ప్రభాకర్ చీర కవిత, సలీమ్, నరేష్, ఉపేందర్ రవీందర్, శ్రీవాణి, యాకమ్మ పాల్గొన్నారు.