Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త పార్లమెంటుకు అంబేద్కర్ పేరును ప్రకటించాలి
- దళిత బందుకు ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వద్దు
- మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
నవతెలంగాణ - స్టేషన్ ఘనపూర్
పచ్చని పాడిలా విరాజిల్లుతున్న తెలంగాణ రాష్ట్రంలో మత విద్వేశాలను రెచ్చగొడుతూ, రాష్ట్ర విభజన చట్ట హామీలు కనీసమైన నెరవేర్చకుండా, రాష్ట్ర హక్కుల్ని కాలరాస్తున్న బీజేపీ, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో చోటు ఇవ్వొద్దని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. నియోజకవర్గ కేంద్రంలో ఏడు మండలాల్లోని 69 మంది లబ్ధిదారులకు సుమారు రూ 29 లక్షల వ్యయపు సీఎం సహాయనిది చెక్కులను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా రైస్ మిల్లార్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెలిదేవెంకన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో కడియం మాట్లాడారు. సీఎంఆర్ఎఫ్ పేద వర్గాలకు అండగా నిలిచిందన్నారు. పార్టీలకతీతంగా, నియోజకవర్గ వ్యాప్తంగా లబ్ధిదారులందరికి అందిస్తున్నారన్నారు. సుమారు నెలకు 100 మందికి పైగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎంఆర్ఎఫ్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 1994 - 2022 వరకు ప్రజల మధ్య ఉంటూ, ప్రజల కష్టసుఖాల్లో తన శక్తి మేరకు ప్రజలకు, అభివద్ధి, సంక్షేమంలో పాటుపడుతున్నానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివద్ధి ఫలాల ఎంపికలో, అవినీతి అక్రమాలకు తావు లేకుండా పనిచేస్తున్నట్టు తెలిపారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్ జెండా ఎగరవేయడానికి సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై అనేక విధాల ఆంక్షలు విధిస్తూ అభివద్ధికి ఆటంకంగా మారుతోందన్నారు. దేశవ్యాప్తంగా నాలుగు లక్షల మెగావాట్ల సామర్థ్యం ఉంటే, రెండు లక్షల 40 మెగావాట్లతో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ, దేశ రైతన్నలను ఇబ్బందుల పాలు చేస్తుందని అన్నారు. అంబేద్కర్ పేరును, పార్లమెంట్ భవనానికి నామకరణం చేయాలని శాసనమండలిలో తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. బిజెపి నాయకులు బండి సంజరు, కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. మూడోసారి ముచ్చటగా సీఎం కేసీఆర్ ను సీఎం చేస్తే, కేంద్రంలో ప్రాతినిధ్యం ప్రాతినిధ్యం వహిస్తే, దేశమంతటా ఉచిత విద్యుత్ అందించే విధంగా వీలుందని అన్నారు. రానున్న రోజుల్లో ప్రతీ దళిత కుటుంబానికి దళిత బంధు అందించేందుకు కేసీఆర్ రూపకల్పన చేస్తున్నట్లు పేర్కొన్నారు. సర్పంచుల ఫోరం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదని, అందరూ సర్పంచులు ఒక్కటిగా కలిసి ఒకరిని నియమించి, తమ సమస్యలను పరిష్కరించుకోవడం తప్పా, అందరూ బలపరిచే నియమించిన వారికి, నేటికీ అదే పేరుతో చెల్లుబాటు అవడం సిగ్గుచేటని తాటికాయల సర్పంచ్, ధర్మసాగర్ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పెసరు రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ క్రిష్ణారెడ్డి, రైస్ మిల్లర్స్ రూరల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బెలిదే వెంకన్న, జిల్లా నాయకులు ఇల్లందుల సుదర్శన్, మధుసూదన్ రెడ్డి, బూర్ల శంకర్, కేశిరెడ్డి మనోజ్ రెడ్డి, కరుణాకర్ రావు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పోగుల సారంగపాణి, తదితరులు పాల్గొన్నారు.