Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
నవతెలంగాణ-పాలకుర్తి
రాష్ట్ర జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు దేశానికి ఆదర్శం కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. నేడు పాలకుర్తిలో జరిగే జాతీయ సమైక్యత వేడుకల ఏర్పాట్లను గురువారం మంత్రి ఎర్రబెల్లి సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలోని ఎంపీపీ ఛాంబర్ లో అధికారులు, ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు విజయవంతంగా జరిగేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పాలకుర్తిలో జరిగే సమైక్యత వేడుకలు రాష్ట్రానికే ఆదర్శం కావాలన్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుండి 15వేల మందిని తరలించేందుకు దష్టి పెట్టాలని సూచించారు. వేడుకలను విజయవంతం చేసేందుకు డ్వాక్రా మహిళలు, కళాకారులు, డప్పు కళాకారులు, చిందు యక్షగాన కళాకారులతోపాటు ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘన్పూర్ ఆర్డిఓ కష్ణవేణి, ఎంపీపీ నల్ల నాగిరెడ్డి,జెడ్పి ఫ్లోర్ లీడర్ పుషఉ్కరి శ్రీనివాసరావు, తహసీల్ధార్ భూక్య పాల్సింగ్నాయక్, ఎంపీడీవో వనపర్తి అశోక్ కుమార్, సర్పంచ్ వీరమనేని యాకాంతరావు, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ జరుపుల బాలునాయక్, ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండి మదర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, మండల కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, పాలకుర్తి, తొర్రూర్ సొసైటీల చైర్మన్లు బొబ్బల అశోక్ రెడ్డి, గోనే మైసిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.