Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిల్డింగ్ అదర్స్ కనస్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరాజు
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
బిల్డింగ్ రంగ కార్మికులకు కార్మిక శాఖ మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం మోటార్ సైకిల్లు ఇవ్వాలని బిల్డింగ్ ఆదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరాజు అన్నారు. కేసముద్రం మండల కేంద్ర లో ని హరిహరా గార్డెన్స్‌లో భవన నిర్మాణ కార్మికుల మండల నాలుగవ మహాసభ గురువారం ముల్క మురళి అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు కోటంరాజు హాజరై మాట్లాడుతూ భవనిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో పేరు నమోదు చేసుకున్న 55 సంవత్సరాల దాటిన కార్మికులకు ఐదువేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే బోర్డులో కార్మికుడు ఒకసారి పేరు నమోదు చేసుకుంటే ఎప్పటికీ ఉండే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ రంగంలో 54 రకాల కార్మికులు పనిచేస్తున్నారని సుమారు 25 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్మికుల నుండి బిల్డింగ్ వర్క్స్ బోర్డ్ పరిధిలో రూ.35 కోట్లు మూలుగుతున్నాయని, కార్మికులకు రావాల్సిన డబ్బులను వెంటనే ఇవ్వాలన్నారు. మహబూబాద్ జిల్లాలో రాష్ట్ర మహాసభలను నిర్వహించాలని సంఘం భావించిందని, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తొర్రూర్ ఏఎల్ఓ సుమతి హాజరై మాట్లాడుతూ బిల్డింగ్ కార్మికులందరూ కార్డ్స్ తీసుకోవాలని, తీసుకున్నవారు రెన్యువల్ చేసుకోవాలని అవగాహన కల్పించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆకుల రాజు, జిల్లా అధ్యక్షుడు కుంట ఉపేందర్, భవనిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తాడబోయిన శ్రీశైలం, సిఐటియు మండల కార్యదర్శి జల్లే జయరాజు, జిల్లా నాయకులు గారె కోటేశ్వరరావు, బానోత్ శంకర్, కుమ్మరి కుంట్ల నాగన్న, మండల నాయకులు ఏదునూరి శ్రీనివాస్, గుంజపడుగు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.