Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్
నవతెలంగాణ-బయ్యారం
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరించేందుకే బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నంబూరి మధు అధ్యక్షతన జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సదస్సులో శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ... స్వాతంత్ర ఉద్యమం తెలంగాణ సాయుధ పోరాటంలో బిజెపి పాత్ర లేనప్పటికీ తామే పోరాటంలో పాల్గొన్నమంటూ చరిత్రను వక్రీకరిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటం రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిందని నాడు కమ్యూనిస్టులు వీరోచితమైన పోరాటాలు చేశారని ఆ పోరాటంలో ఎంతో మంది కమ్యూనిస్టు, పార్టీ కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేశారని ఆయన గుర్తు చేశారు. కానీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. ఎన్నికల నాటికి రజాకార్ల ఫైల్ సినిమా తీసి ప్రజల మధ్య మతవిద్వేషాలు సష్టించబోతున్నారని చెప్పారు. దేశానికి వామపక్షాల భావాజాలం ఎంతో అవసరం ఉందని అన్నారు. రాజ్యాంగమైన పదవిలో ఉంటూ గవర్నర్ రాజభవన్ ను పార్టీ వేదికగా మార్చడం సరైనది కాదన్నారు. గవర్నర్ హౌదాలో ఉండి రాజకీయాలు ప్రస్తావించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని అన్నారు. మళ్లీ మోడీ ప్రధాని అయ్యేందుకు పన్నాగం పన్నుతున్నారని ప్రజలంతా జరగబోయే ప్రమాదాన్ని విజ్ఞతతో ఆలోచించాలని కోరారు. ఈ నెల 17న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మండా రాజన్న, నాయకులు నిడికొండ చంటి, తోడుసు యాదగిరి, బల్లెం ఆనందరావు, మెరుగు వెంకన్న, కే.విజయ, వెన్నుమోహన్, వి.వెంకన్న, జే.శ్రీను, ఎం.తిరుపతిరావు, డి.పెంటయ్య, ఎన్ మారయ్య పాల్గొన్నారు.