Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేజీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎంవీ రమణ
నవతెలంగాణ - డోర్నకల్
కల్లు గీత వత్తిపై ఆధారపడి జీవిస్తున్న 5 లక్షల కుటుంబాల ఉపాధికి రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్పొరేషన్‌కు రూ.5 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని కేజీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎంవీ రమణ డిమాండ్ చేశారు. గురువారం డోర్నకల్ మండల కేంద్రంలోని గొల్లచర్ల గ్రామంలోని విజయ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో బొల్లగాని పుల్లయ్య,మంద రాములు ప్రాంగణంలో సంఘం మండల అధ్యక్షులు మేకపోతుల అంజయ్య అధ్యక్షతన నిర్వహించిన మండల మహా సభలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ లిక్కర్ పాలసీతో గీత వత్తి దెబ్బతింటున్నదని అన్నారు. ప్రభుత్వం లిక్కర్, బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏరులై పారిస్తూ గీత కార్మికులకు పూర్వవైభవం తెస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. మద్యనిషేధం అమలు చేయాలని అన్నారు. ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి, కల్లుకు మార్కెట్, నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేయాలని అన్నారు. గౌడ కల్లుగీత కార్మికులకు ప్రతి ఒక్కరికి బైక్ లు ఇవ్వాలని, కల్లుగీత వత్తిదారులకు గీతన్న బంధు పేరుతో రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎక్స్ గ్రేషియా రూ.10 లక్షలకు పెంచాలని, మెడికల్ బోర్డు నిబంధన తొలగించాలని, అర్హులందరికి సభ్యత్వం, గుర్తింపు కార్డులు కొత్త జిల్లాల పేరుతో ఇవ్వాలని కోరారు, కల్లుకు మార్కెట్ సౌకర్యం కలగాలంటే ముఖ్యమంత్రి ప్రచార కర్తగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌడ కల్లుగీత సంఘం రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, కేజీకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌని వెంకన్న, జిల్లా అధ్యక్షులు యమగాని వెంకన్న,అఖిలభారత గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు కల్లెపు సతీష్ కుమార్‌గౌడ్, మాజీ ఎంపీపీ మేకపోతుల రమ్య శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు బోయినపల్లి వెంకన్న, జెడ్పీటీసీ కమల రామనాధం, మాజీ సర్పంచ్ గంధంసిరి ఉపేందర్,మండల కార్యదర్శి గాదె నాగేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.