Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య
- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 75వ వార్షికోత్సవ సభ
నవతెలంగాణ-మరిపెడ
ఎవరు అవునన్నా... కాదన్నా... వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సెప్టెంబర్-17 ఎర్రజెండా కమ్యూనిస్టుల వారసులదేనని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని భార్గవ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రైతంగా సాయుధ పోరాట 75వ వార్షికోత్సవ సభ గురువారం జరిగింది. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌తో కలిసి జి నాగయ్య పాల్గొని మాట్లాడారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు పూర్తవుతుందని, ఎన్నడూ లేని విధంగా బీజేపీ తెలంగాణ ప్రజలపై ప్రేమ కురిపిస్తుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావించినప్పటి నుండి సెప్టెంబర్ 17న విమోచన దినంగా జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నదన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి బీజేపీ కి ఏమి సంబంధం అని ప్రశ్నించారు. 1946 సెప్టెంబర్-11 నుంచి 1951 అక్టోబర్ 21 వరకు సాయుధ పోరాటం సాగిందని, ఈ పోరాటానికి కమ్యూనిస్టులు నాయకత్వం వహించారని స్పష్టం చేశారు. దేశంలో 1925 నుంచి ఉన్న ఆర్ఎస్ఎస్ గాని, 1915 పనిచేస్తున్న హిందూ మహాసభ గాని, ఆ తర్వాత రాజకీయ పార్టీకి ఏర్పడిన బీజేపీగానీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఎలాంటి సంబంధం లేని విధంగానే ఉన్నారని అన్నారు. నేడు తెలంగాణ లో మత విధ్వేషాలు సృష్టించే కుట్రకు బీజేపీ పూనుకుంటోందన్నారు. 1946లో ఆంధ్ర మహాసభ (సంఘం ) కమ్యూనిస్టు నాయకుల సహాయంతో చాకలి ఐలమ్మ భూస్వాముల ఆగడాలను తిప్పి కొట్టిందని వివరించారు. జులై 4న నిజాం సైన్యం కాల్పుల్లో దొడ్డి కొమరయ్య తొలి అమరుడు అయ్యారని తెలిపారు. ముస్లింకు చెందిన బందగినీ నిజాం సర్కార్ పొట్టన పెట్టుకున్నారని తెలిపారు. 1928లో ఏర్పడిన ఆంధ్ర మహాసభ క్రమంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో భూ పోరాటాలు, మాతభాష సంస్కతిగా పునర్జీవం ఉద్యమం కొనసాగించిందని గ్రామ స్వరాజ్యాలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. నిజాంరాజు 1500 మందిని పొట్టన పెట్టుకున్నారని, నాడు హౌంశాఖ మంత్రిగా ఉన్న సర్దార్ వల్లభారు పటేల్ సైన్యం 2500 మందిని పొట్టన పెట్టుకున్నా ఈ పోరాటం ఆగలేదని తెలిపారు. నాడు తప్పనిసరి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిదాని, కౌలుదారు చట్టం తెచ్చిందన్నారు. దున్నేవాడికి భూమి కావాలని భూసంస్కరణల చట్టాన్ని చేస్తామని ప్రకటించింది అన్నారు. ఈ నేపథ్యంలో 1951 అక్టోబర్ 21 కమ్యూనిస్టులు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం విరమింప చేశారని తెలిపారు. ఎర్రజెండా నాయకత్వంలో సాగిన చారిత్రక పోరాటాన్ని భవిష్యత్ తరాలకు అందించడం నేటి పాలకులకు ఇష్టం లేదని విమర్శించారు. ఆలస్యంగా నైన టీఆర్ఎస్ ప్రభుత్వం మేల్కొని తెలంగాణ వారోత్సవ సభలు నిర్వహిస్తామని ప్రకటించడం అభినందనీయం అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అలవాల వీరయ్య, జిల్లా నాయకురాలు కందనూరి కవిత, మండల కార్యదర్శి దుండి వీరన్న, పార్టీ ఆర్గనైజర్ బాణాల రాజయ్య, మండల నాయకులు నందిపాటి వెంకన్న, కందాల రమేష్, గంధసిరి పుల్లయ్య, అల్లి శ్రీనివాస్ రెడ్డి, కొయ్యడ రామయ్య, తాటికొండ అనంత చారి, పుల్లూరి దేవయ్య, భయ్యా సోమయ్య,జిన్నా మాధవి, కొండ ఉప్పలయ్య, మధుసూదన్, రాజశేఖర్, షరీఫ్, రేఖ శీను, బత్తెం శ్రీనివాస్, నల్లబోలు లక్ష్మారెడ్డి, సత్తిరెడ్డి, పాలబిందుల యాదగిరి, కారంపూడి ముల్కయ్య, నందిపాటి ఉప్పలమ్మ, దుండి ఎల్లమ్మ, వొడ్లకొండ ఉప్పలయ్య, తదితరులు పాల్గొన్నారు.