Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
దళితులకు 300 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి కేవీపీఎస్ డిమాండ్ చేసింది. గురువారం హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరెంటు డివిజనల్ ఆఫీసర్లు ఏడీ, డీఈలకు వినతి పత్రం అందజేశారు. అనంతరం కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ మాట్లాడుతూ వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు ధనవంతులకు కోట్ల రూపాయలు కూడా పెట్టుకున్న పారిశ్రామికవేత్తలకు విద్యుత్ రాయితీలు ఇస్తూ దళితుల ఇండ్లకు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేస్తోందనన్నారు. దళితులకు ఇచ్చిన వాగ్దాలను అమలు చేయడం లేదన్నారు. జీవో 342 ప్రకారం దళితులకు 101 యూనిట్స్ విద్యుత్ ఉచితంగా ఇవ్వాల్సి ఉండగా క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఇవ్వలేని కారణంగా అది కూడా అమలు కావడం లేదని అన్నారు. దళితుల కోసం పది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం హానుమకొండ డివిజనల్ ఆఫీసుకు జమ చేసినా కూడా నిధులు వినియోగించుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. కేరళ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం కూడా 342 జీవోను సవరించి 300 యూనిట్స్ వరకు ఉచిత కరెంటు ఇవ్వాలని అన్నారు. లేదంటే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు ఓరుగంటి సాంబయ్య, ఉపాధ్యక్షులు దూడపాక రాజేందర్ ముడుసు నారాయణ ,జిల్లా సహాయ కార్యదర్శులు దానబోయిన రాంబాబు, గడ్డం అశోక్, జిల్లా కమిటీ సభ్యులు హర్షం రామ్ కి, గద్దల బద్రి, రేణిగుంట్ల సుమన్, రాకేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.