Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ విజయబాబు
నవతెలంగాణ-మహబూబాబాద్
ప్రజా పోరాటాలతోనే హక్కులు సాధించుకోగలుగుతామని, హదయపూర్వకంగానే తెలంగాణ విమోచన జరిగిందని కాకతీయ విశ్వవిద్యాలయం చరిత్ర విభాగాధిపతి సీనియర్ ప్రొఫెసర్ విజయబాబు అన్నారు. గురువారం మహబూబాబాద్ పట్టణంలోని నలంద డిగ్రీ కళాశాలలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం పై నిర్వహించిన అవగాహన సెమినార్లో విజయబాబు మాట్లాడారు దేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ తెలంగాణ నైజాం రాజు పరిపాలన పరిధిలోనే ఉందని రజా కారుల అరాచకాలపై ప్రజా పోరాటం ఫలితంగానే తెలంగాణకు విమోచన జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో నలందా డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ డోలి సత్యనారాయణ, ప్రిన్సిపాల్ వై కష్ణ ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ కెవి శంకర్, అధ్యాపకులు బి గోవర్ధన్ రమేష్, ప్రసాద్, ఉప్పలయ్య, రాజు తిలక్, పాషా, ప్రసాద్, విశ్రాంత ఉపాధ్యాయులు మైస నాగయ్య పాల్గొన్నారు.