Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్కతుర్తి
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పెన్షన్ లు ఇస్తామని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని శ్రీ సత్య సాయి గార్డెన్ లో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో గతంలో 5340 మంది, నూతనంగా 1241మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నామన్నారు. మొత్తంగా మండలానికి నెలకు రూ. 1కోటి 45లక్షల 20వేల 648లు ఖర్చు అవుతోందన్నారు. అవుతాయన్నారు. పుట్టిన శిశువు నుండి చనిపోయే వద్ధుల వరకు, ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. 70ఏండ్ల పరిపాలన లో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసింది ఏమీ లేదన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. గతంలో ఎరువులు విత్తనాల కోసం లైన్లో వేచి ఉండే పరిస్థితి ఉండేదని నేడు స్వరాష్ట్రంలో ఆ సమస్య లేకుండా చేశామన్నారు కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి నీళ్లు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే నన్నారు. రైతుబంధు, ఆసరా అందించడమే కాకుండా గురుకుల పాఠశాలలు స్థాపించి మెరుగైన విద్యనందిస్తు న్నదన్నారు. జెడ్పీ చైర్మన్ మారేపల్లి సుధీర్ కుమార్ ,ఎంపీపీ మేకల స్వప్న, వైస్ ఎంపీపీ తంగెడ నగేష్, తాసిల్దార్ గుజ్జుల రవీందర్ రెడ్డి, ఎంపీడీవో తూర్పాటి సునీత, సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్, చైర్మన్ శేషగిరి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గొడిశాల సమ్మయ్య గౌడ్, రైతుబంధు మండల కన్వీనర్ పోరెడ్డి రవీందర్ రెడ్డి, రైల్వే బోర్డు మెంబర్ ఎల్తూరి స్వామి, తదితరులు పాల్గొన్నారు.
ముదిరాజ్,బెస్త, మత్స్యకారుల ఆర్థిక అభివద్ధే లక్ష్యం
ముదిరాజుల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్బ అన్నారు. మండలం లోని గోపాల్ పూర్ గ్రామ చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... మత్స్యకారుల, ముదిరాజ్, బెస్త ల ఆర్థిక అభివద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వారికి కావాల్సిన వాహనాలను,వలలను ఇవ్వడం జరిగిందన్నారు. ఎంపీపీ మేకల స్వప్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోడిశాల సమ్మయ్య గౌడ్, సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్, రైతుబంధు మండల కన్వీనర్ పోరెడ్డి రవీందర్ రెడ్డి, ఎంపీటీసీ యశోద రాజేశ్వరరావు, మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు పెండ్యాల జగదీశ్వర్,కార్యదర్శి సోనబోయిన సాంబయ్య, పాలకవర్గం సాంబరాజు, తిరుపతి, రాకేష్, తదితరులు ఉన్నారు.
భీమదేవరపల్లి : పేదలకు అండగా ఆసరా పెన్షన్లు ప్రభుత్వం అందిస్తున్నదని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. మండలంలోని ముల్కనూర్ లో గురువారం ఆసరా పెన్షన్లు అందించే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండలంలో గతంలో 5070 పెన్షన్లు ఉండగా ప్రస్తుతం మరో 1842 పెన్షన్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. గతంలో 47 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ జరిగిందన్నారు. కొద్దిరోజుల్లోనే హుస్నాబాద్ నియోజకవర్గం లోని అర్హులైన రైతులందరికీ లక్ష రూపాయల రుణమాఫీ వర్తింపచేయనున్నట్లు తెలిపారు. రైతుబంధు ద్వారా పదివేల 481 మంది రైతులకు 10 వేల చొప్పున రూ.96 కోట్ల70 లక్షలు అందినట్టు తెలిపారు. మతి చెందిన ఒక వంద 52 మంది రైతుల వారసులకు ఏడు కోట్ల 60 లక్షల రూపాయలు రైతు బీమా అందించినట్లు పేర్కొన్నారు. కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై మందికి రూ.11 కోట్ల 33 లక్షలు అందినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరికొంతమందికి పెన్షన్లు అందిస్తామని తెలిపారు. హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ ఎంపీపీ జక్కుల అనిత రమేష్, జెడ్పిటిసి వంగ రవి, వైస్ ఎంపీపీ మాడుగుల ఎజ్రా, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మండల సురేందర్, సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు గూడెల్లి రాజిరెడ్డి, తాసిల్దార్ ఉమారాణి, ఎంపీడీవో భాస్కర్ పాల్గొన్నారు.