Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ - ములుగు
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కషి చేయాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క పిలుపునిచ్చారు. ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి అధ్యక్షతన గురువారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మండల,వర్కింగ్ కమిటీ అధ్యక్షుల సమావేశంలో సీతక్క పాల్గొని మాట్లాడారు. గ్రామ గ్రామాన ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడు కుంటామన్నారు. గ్రామ,మండల బ్లాక్ కాంగ్రెస్ ల వారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రభుత్వాల నియంతత్వ పోకడలతో పేదలను నట్టేట ముంచిన పరిస్థితి ఉందని అన్నారు. స్వరాష్ట్రంలోనూ ప్రజలకు చేసింది ఏమి లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిత్యవసర ధరలతోపాటు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నదన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
ములుగు నియోజకవర్గంలోని మంగపేట,ఏటూరునాగారం, కొత్తగూడ, గంగారాం, వేంకటా పూర్,ములుగు,గోవిందారావుపేట, తాడ్వాయి మండాలాలకు చెందిన 27మంది లబ్దిదారులకు ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కులను గురువారం ఎమ్మెల్యే కాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సీతక్క పంపిణీ చేశారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
ములుగు మండలం జంగాల పల్లి గ్రామానికి చెందిన మూశిన పెల్లి బాగువాన్ దాస్ సతీమణి విజయ లక్ష్మి గురువారం మతిచెందింది. బాధిత కుటుంబానిక్న ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి బాగ్ వాన్ రెడ్డి, ఇరుసవడ్ల వెంకన్న మండల అధ్యక్షులు ఎండీ చాంద్‌పాషా, సూర్యనారాయణ, జయరాంరెడ్డి, రఘు, అఫ్సర్ పాషా, మాజీ సహకార సంఘం చైర్మన్ కునురు అశోక్ గౌడ్, మాజీ సర్పంచ్ ముషిన పెల్లి కుమార్ గౌడ్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటి, గ్రామ కమిటీ అధ్యక్షులు మాదాసి శ్రీను తదితరులు పాల్గొన్నారు.