Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్, ఎమ్మెల్యే
నవతెలంగాణ-భూపాలపల్లి
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ నెల 16న నిర్వహించే భారీ ర్యాలీలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో జరిగే ఏర్పాట్లను పరిశీలించారు. 16 వ తేదీన ర్యాలీ మొదలయ్యే ప్రదేశ్హాలను (న్యూ మార్కెట్ , ఓల్డ్ మార్కెట్ మరియు జయశంకర్ చౌరస్తా )ల నుండి అంబేడ్కర్ మైదానం వరకు ర్యాలీ ఉంటుందన్నారు. 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. 10వేల జాతీయ పతాకాలతో జాతీయ భావం పెంపొందే దిశగా ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. భోజన సమయంలో ఎలాంటి ఇబ్బంది కల్గకుండా అధిక సంఖ్యలో కౌంటర్లు ఏర్పాటు చేయాలని, కౌంటర్ వద్ద ఒక అధికారికి బాధ్యతలు అప్పగించామన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.