Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
- రాజకీయ లబ్ధి కోసం తెలంగాణాలో చిచ్చు పెట్టాలని చూస్తున్న బీజేపీ
- సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కృష్ణారెడ్డి
నవతెలంగాణ-ములుగు
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ నిర్మూల నకు వ్యతిరేకంగా జరిగిన మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసులు కమ్యూని స్టులేనని, రాజకీయ లబ్ది కోసమే బీజేపీ తెలంగాణ లో చిచ్చు పెట్టాలని చూస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి అన్నారు. స్థానిక సీపీఎం జిల్లా కార్యాలయంలో ఎండి అమ్జద్ పాషా అధ్యక్షత న ''తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవ సభ'' శుక్రవారం నిర్వహించారు. అంత కంటే ముందు జంగాలపల్లి నుండి కలెక్టరేట్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1946-51 మధ్య కాలంలో నైజాం నియంతత్వానికి వ్యతిరేకంగా జరిగిన సాయు ధ రైతాంగ పోరాటం ప్రధాన కారణం.'నీబాంచను దొర కాల్మొక్త' అని బతుకులు గడుపుతున్న సామా న్యులు ''నీ గోరీకడ్తం కొడుకో నైజాము సర్కరోడా'' అని తిరుగుబాటు బావుటానెగరేసి ధిక్కార స్వరాన్ని వినిపించారని అన్నారు. నిజాం రాజరిక రాక్షస పాల నలో ప్రభుత్వ తొత్తులుగా వ్యవహరించిన జాగీ ర్దార్లు, దేశ్ముఖ్లు, పటేల్, పట్వారీలైన జన్నారెడ్డి ప్రతాపరెడ్డి, విసునూరి దేశ్ముఖ్ లతో పాటు రజా కార్లు ప్రజల పై నిర్బంధాలు, దోపిడీ, చిత్ర హింసలు, హత్యలు, మానభంగాలు, లూటీలు, ప్రజ ల్లో బీభ త్సాన్ని సష్టించారని అన్నారు. దేశవ్యాప్తంగానే భూ సమస్య ప్రధాన ఎజెండాగా ముందుకు వచ్చి ప్రభుత్వాలు అరకొరగానైనా భూ చట్టాలు తేవడానికి, భూ సంస్కరణలలు అమలు జరపడానికి ఈ పోరాటం ప్రేరణగా నిలిచిందనీ, వెట్టిచాకిరి రద్దయిం దనీ, దున్నేవానికే భూమి నినాదం దేశమంతా విస్తరించిందన్నారు. గోబెల్స్ తరహా ప్రచారంలో సిద్ధహస్తులయిన వీరి ప్రచారాన్ని నేటితరం అర్థం చేసుకోవాల్సి వుందని, వక్రీక రణలను తిప్పికొట్టాలనీ, చారిత్రక పోరాటానికి నిజమైన వారసులు కమ్యూని స్టులేనని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకట్ రెడ్డీ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భీరెడ్డి సాంబశివ, రత్నం రాజేందర్,ఎండి దావుద్, చిట్టిబాబు, ఆగి రెడ్డి, ఎండీ గఫూర్ పాషా, యాకుబ్,వాసుదేవ రెడ్డి,గొంది రాజేష్, రత్నం ప్రవీణ్, గుండెబోయిన రవి గౌడ్,దుగ్గి చిరంజీవి, బొడ రమేష్, సంజీవ,అటికే సాంబయ్య, గుండు రామస్వామి,అంబాల మురళి పాల్గొన్నారు.
వార్షికోత్సవ సభకు తరలిన సిపిఐ(ఎం) నాయకులు
గోవిందరావుపేట : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభకు మండలం నుండి శుక్రవారం భారీ సంఖ్యలో సిపిఐ(ఎం) నాయ కులు ద్విచక్ర వాహన ర్యాలీతో బయలుదేరి వెళ్లారు. సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి ఉదయం కార్యక ర్తను భారీగా సమీకరించి ద్విచక్ర వాహన ర్యాలీని ప్రారంభించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభకు ఉత్సాహంతో యువత ములుగు బయలుదేరి వెళ్లారు. దారి పొడవునా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులను స్మరిస్తూ నినాదాలు చేస్తూ పాటలు పాడుతూ ప్రజలలో కొత్త ఉత్సాహాన్ని నింపారు.