Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
సెప్టెంబర్ 17న రంగశాయిపేట ఏరియా లో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల బహిరంగ సభను జయప్రదం చేయాలని జిల్లా కమిటీ సభ్యుడు, రంగశాయిపేట ఏరియా కార్య దర్శి మాలోతు సాగర్ శుక్రవారం ఒక ప్రకట నలో కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ నేటికి అనేక ప్రాంతాల్లో కులం పేరుతో దూషిస్తూ సంఘ బహిష్క రణలను చూస్తున్నామని ఈ విష సంస్కృతికి చిన్న పిల్లలు కూడా బలి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవి మరింత పెరిగాయని, రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్‌కు కూడా గౌరవం ఇవ్వని సంస్కృతి దాపరించిందని అన్నారు. దళిత గిరిజనుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ఎండ గట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు జి. నాగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్ వీరయ్య,జిల్లా కార్యదర్శి రంగయ్యలు బహిరంగ సభకు హాజరవుతారని తెలిపారు. బహిరంగ సభకు ముందు నాయుడు పెట్రోల్ పంపు నుండి మహంకాళి సభ ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జక్కలొద్ది కార్యదర్శి గానే పాక ఓదేలు, రామ సందీప్, మీడియా ఇంచార్జి చందు తదితరులు పాల్గొన్నారు.