Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కళాకారులు, డప్పు వాయిద్యాలు, బతుకమ్మలు, బోనాలతో సుమారు
- 15 వేల మందితో భారీ ర్యాలీ
- వర్ధన్నపేట బస్టాండ్ నుండి ఫిరంగిగడ్డ వరకు భారీ ర్యాలీ
నవతెలంగాణ-వర్ధన్నపేట
తెలంగాణ జాతీయ వజ్రోత్సవ వేడుకల ను ఘనంగా జరుపుకోవడం రాష్ట్ర ప్రజలంతా సంతోషిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నియోజకవర్గ కేంద్రంలో సుమారు 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, మహిళలు, విద్యా ర్థులు, కవులు, కళాకారులు, యువకులు, ప్రజలు పెద్ద ఎత్తు న పాల్గొన్నారు. దాదాపు 3 కిలోమీటర్లు సాగిన ర్యాలీలో డప్పు వాయిద్యాలు, కళాకారుల నృత్యాలు, బతుకమ్మలు, బోనాలు, ఆట పాటలతో పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం ఫిరంగిగడ్డలో ఎమ్మెల్యే అరూరి రమేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు మంత్రి దయాకర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత దేశ పౌరులందరికీ ఆగస్టు15 ఎంత ముఖ్యమైన రోజో తెలంగాణ పౌరులకు సెప్టెంబర్ 17 కూడా అంతే ముఖ్యమైన రోజని తెలిపారు. సెప్టెంబర్ 17ను కొందరు విమోచన దినం అని, మరికొందరు విలీన దినం అని, ఇంకొందరు విముక్తి దినం అని రకరకాలుగా పిలుస్తున్నారు. కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని, అసలైన చరిత్రను ప్రజలకు చెప్పాలనే ఉద్దేశ్యంతో సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా ప్రకటించినట్లు తెలిపారు. సెప్టెంబర్ 17ను అడ్డం పెట్టుకుని కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేయడానికి, ప్రజల మధ్య విద్వేషం పెంచడానికి కుట్రలు చేస్తున్నాయి. ఇప్పటికైనా మనమంతా చరిత్ర తెలుసుకొని అసలు 1948 సెప్టెబర్ 17న ఏం జరిగిందో, దాన్ని మనం ఇవాళ జాతీయ సమైక్యతా దినంగా ఎందుకు జరుపుకుం టున్నామో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సమాజంలోని మేధావులు, విద్యావంతులు, ఉపాధ్యాయులు తెలంగాణ అసలు చరిత్రను ప్రజలకు వివరించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో మనమంతా ఎట్లయితే ఐక్యంగా కొట్లాడామో, ఆనాడు కూడా అలాగే పోరాడారని తెలిపారు. 1947 నుంచి ఏడాది పాటు ఎన్నో ఉద్యమాలను అణచివేయడానికి అప్పటి పాలకులు దమనకాండకు దిగడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇది చరిత్ర ఇది నిజం. అన్నింటికి మించి భారతదేశం సమై క్యంగా, భద్రంగా ఉండాలని నినదించారని వెల్లడించారు. ఆనాటి తెలంగాణ ప్రజల ఆలోచన, ముందు చూపు వల్లనే 75 ఏళ్ల పాటు మన దేశం సర్వ స్వతంత్ర దేశంగా వెలుగొం దుతోందని అదే సమైక్యతా స్పూర్తిని కొనసాగించడం కోసం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని పిలుపునిచ్చారని తెలి పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీవత్సవ, డీసీసీబీ చైర్మన్ మార్నెని రవీందర్ రావు, రైతు బందు సమితి జిల్లా అధ్యక్షురాలు ఎల్లావుల లలితా యాదవ్, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, మహిళలు, విద్యార్థులు, కళాకారులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మట్టెవాడ : రాచరిక పరిపాలనకు వ్యతిరేకంగా కొట్లా డిన ఘన చరిత్ర ఓరుగల్లు నగరానికి ఉన్నదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో పోచమ్మ మైదాన్ జంక్షన్ నుండి సికెఎం కళాశాల మహా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు,మెప్మా, కార్మికులు, వైద్య విద్యార్థులు, జాతీయ జండా పట్టుకొని పెద్ద ఎత్తున ర్యాలీగ సభా ప్రాంగణం వరకు నడుచుకుంటూ తరిలారు. అనంతరం సికేఎం కళాశాల వద్ద వరంగల్ కలెక్టర్ గోపి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో పాల్గొన్నారు. ముందుగా సభలోని ప్రజలు ప్రతినిధులు జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం ఆయన మాట్లా డుతూ ఓరుగల్లు పోరుగడ్డ మీద పుట్టిన మొగిలయ్య గౌడ్, భూపతి కష్ణమూర్తి , ఇటికాల మధుసూదన్ రావు, మొన్ననే మతి చెందిన కమలమ్మకు శిరస్సు వంచి ఉద్యమాభి వందనాలు తెలుపుతున్నారని అన్నారు. వరంగల్ నగరం ఎంతోమంది సమరయోధులకు జన్మనిచ్చిందని ఆనాడు రాచరిక పరిపాలనను అంతం చేసేందుకు ఎంతోమంది అమరులు అయ్యారని, కొందరు కులాలు మతాల పేరుతో ప్రజలను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని వారందరితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనందరి పైన ఉందని అన్నారు.కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, ఇన్చార్జి కూడా చైర్మన్ సుందర రాజన్ యాదవ్, డిప్యూటీ మేయర్ రిజ్వాన షమీమ్, వరంగల్ ఏసీబీ గిరి కుమార్ కలకోట, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.
ములుగు : రజాకార్ల పాలన నుండి స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైనందున శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. శుక్రవారం జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా మొదటి రోజు జాతీయ రహదారి పక్కన పెట్రోల్ బంక్ నుండి నుండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల గట్టమ్మ వరకు భారీ సంఖ్యలో విద్యార్థులు, అధికారులు, పోలీస్ శాఖ, ప్రజలు తరలిరాగా డీఈఓ కార్యాలయం నుండి పెట్రోల్ బంక్ వరకు జాతీయ పతాకం చేతపట్టి భారత్ మాతాకీ జై, జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ఎంపీ మాలోత్ కవిత, స్థానిక ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క), కలెక్టర్ ఎస్ కష్ణ ఆదిత్య, ఎస్పి సంగ్రామ్ సింగ్ జి పాటిల్, ఓఎస్డి గౌస్ ఆలం, ఏఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ జెండా ఊపి ప్రారం భించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు జాతీయ పతా కాలతో డిజె పాటలు నృత్యాలతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభలో ఎంపీ కవిత మాట్లాడుతూ 1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం వచ్చిన హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర భారతంలో విలీనం కాలేదని ఎందరో నిజాం వ్యతిరేక పోరాట యోధులు చేసిన పోరాటాల ఫలితంగా సర్దార్ వల్లభారు పటేల్ నేతత్వంలో మనకు రజా కారుల నుండి విముక్తి లభించినందున రాష్ట్ర ప్రభు త్వం మూడు రోజులపాటు జాతీయ సమైక్యత దినోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వమని ప్రజలు అందరూ సమానమేనని జాతీయ సమైక్యత సమగ్రత సౌభ్రాతత్వం స్వేచ్ఛ కోసం స్వాతంత్ర పోరాటాలు గాంధీ నేతత్వంలో జరిగాయన్నారు. రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగ ఫలితం వల్ల నేడు మనకు స్వాతంత్రం లభించిందన్నారు. భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అన్ని సంస్థానాలు విలీనం కావడానికి ఒప్పు కుంటే జమ్మూ కాశ్మీర్, జొనా గార్డ్స్, హైదరాబాద్ మూడు సంస్థలు ఒప్పుకోలేదని, హైదరాబాద్ ప్రత్యెక దేశంగా ఉండాలని సైనిక చర్యల ద్వారా సెప్టెంబర్ 17న నిజాం రజాకారుల నుండి మనకు విముక్తి లభించిందని ఆయన తెలిపారు. అనంతరం సాంస్కతిక సారథి కళాకారులచే తెలంగాణా జాతీయ వజ్రోత్సవాలపై ధూమ్ ధాం కార్యక్ర మాలు ప్రజలను అలరించాయి. కార్యక్రమంలో జిల్లా అదన పు కలెక్టర్ వై వి గణేష్ ,డిఆర్ఓ కే రమాదేవి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పళ్ళ బుచ్చయ్య, జెడ్పి వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, జెడ్పిటిసిలు తుమ్మల హరిబాబు, గై రుద్రమదేవి, సకినాల భవాని, పాయం రమణ, ములుగు ఎంపీపీలు శ్రీదేవి, సూడి శ్రీనివాస్ రెడ్డి, కోఆప్షన్ మైంబర్ వలియా బి, రియాజ్ మీర్జా, జిల్లా వివిధ శాఖల అధికారులు జిల్లా వైద్యాధికారి అప్పయ్య, జెడ్పి సీఈవో ప్రసన్నారని డిఆర్డిఓ నాగ పద్మజ, డిఇఓ జిపానిని, జిల్లా అధికారులు, తహసిల్దార్లు సత్యనారాయణ స్వామి, శ్రీనివాస్,ఎంపిడి ఓ లు,పిఎసిఎస్ చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, అన్ని శా ఖల అధికారులు , విద్యార్థులు, మహిళలు, పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్సీ బండా ప్రకాష్
నర్సంపేట : తెలంగాణ విముక్తి కోసం సాగించిన పోరాటంలో దేశ స్వాతంత్స్రోద్యమంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ పాత్రేలేదని ఎమ్మెల్సీ బండా ప్రకాష్ అన్నారు. శుక్రవారం తెలంగాణ జాతీయ సమైఖ్యత వజ్రోత్సవాలు ఘనంగా ప్రారంభమైయ్యాయి.. పట్టణంలోని తెలంగాణ అమవీరుల స్తూపం నుంచి జాతీయ జెండాలను చేతబూని మార్కెట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. తొలత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ బండా ప్రకాష్ తదితరులు తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళ్లర్పించారు..అక్కడి నుంచి బతకమ్మలు, కోలాటాల నృత్య ప్రదర్శనలతో చేపట్టిన ర్యాలీలో పాలుపంచుకున్నారు.వ్యవసాయ మార్కెట్ ఆవరణంలో అదనపు కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన సభలో ఎమ్మెల్సీ బండా ప్రకాష్ ప్రసంగించారు. తెలంగాణ ప్రజలు సాగించిన పోరాట స్ఫూర్తి దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. పోరాటాలకు ఎలాంటి సంబంధం లేని బీజేపీ నేడు నాటి కాంగ్రేస్ ప్రభుత్వంలోని హౌం మంత్రిని సర్థార్ వల్లబాయి పటేల్‌ను తమ నాయకుడిగా చిత్రీకరించుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారధ్యంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికి అందుతున్నాయని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. జాతీయ సమైఖ్యత వజ్రోత్సవ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక నాడు హైదరాబాద్ సంస్థానంగా ప్రత్యేక దేశంగా ఉన్న తెలంగాణ సెప్టెంబర్ 17న భారత దేశంలో విలీనమైందన్నారు. అనేక పోరాటాలు, త్యాగాల వల్ల విలీనం సాధ్యపడిందని తెలిపారు. అణిచివేయబడిన తెలంగాణను నాటి స్ఫూరితో కేసీఆర్ తెలంగాణ ఉద్యమం సాగించి ప్రత్యే క రాష్ట్రంగా సాధించుకోగలిగామన్నారు. పోడు సాగు చేస్తు న్న రైతులకు అటవీ హక్కుల పత్రాలను పంపిణీ చేస్తామన్నారు.ప్రధాన రోడ్లు, అంతర్గ రోడ్లు వచ్చే యేడాదిలో పూర్తి చేసి ప్రతి ఊరికి, తండాకు బీటీ రోడ్లు వేస్తామన్నారు. రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యా ణలక్ష్మీ వంటి పథకాలను ఇతర నియోజవర్గాలకు మించి తీసుకొచ్చి అందించామని గుర్తు చేశారు. ఎన్ని అడ్డం కులు, ఆవరోధాలు ఎదురైనా కార్యదీక్షతో నియోజవర్గ అభివృద్ధికి అహర్నిశలు పాటు పడుతామని ఇందుకోసం ప్రజలు నిండు మనుస్సుతో ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోతు రామా స్వామి నాయక్, జిల్లా పరిషత్ వైఎస్ చైర్మన్ ఆకుల శ్రీని వాస్, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, జెడ్పీ టీఆర్ఎస్ ప్లోర్ లీడర్ పెద్ది స్వప్న, కేయు పాలక మండలి సభ్యులు డాక్టర్ గుండాల మధన్ కుమార్, ఆర్డీవో పవన్ కుమార్, తహసిల్దార్ రామూర్తి, ఏసీపీ సంపత్‌కుమార్, ఎంపీపీలు, జెడ్పీటీసీ, పీఏ సీఎస్ చైర్మన్లు అధికారులు, పాల్గొన్నారు.