Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్షేమ పథకాలు 'ఉచితాలు' కావు : చల్లా
నవతెలంగాణ-పరకాల
దేశ సమైక్యత అభివృద్ధికి సీఎం కేసీఆర్ మొనగాడని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తెలిపారు. పట్టణంలో శుక్రవారం నిర్వహించిన జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొనగా తొలుత వ్యవ సాయ మార్కెట్ నుండి భారీ జనసంఖ్యతో జాతీయ జెండాతో ర్యాలీగా స్థానిక అంబేద్కర్ సెంటర్ వరకు చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలవేసి ఘన నివాళ్లర్పించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడారు. దేశానికి స్వాతంత్రం రావడానికి మహాత్మా గాంధీ ఏ విధంగా కషి చేశారో మనకు తెలిసిన విషయమే దేశంలో హైదరాబాద్ సంస్థానం నైజాం పాలనలో ఉన్నప్పుడు నాటి ఉద్యమ నేత వల్లభారు పటేల్ ఆధ్వర్యంలో యుద్ధ పోరాట ఫలితంగా హైదరాబాద్ దేశంలో విలీనమైందని నాటి నుండి అప్పటి ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలు ఒకే ప్రాంతంగా ఉండాలని ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్ గా ఏర్పాటు చేస్తే నాటి ఆంధ్ర పాలకులు తెలంగాణకు వచ్చే నిధులను, నీళ్లను, నియమకాలను ఇవ్వకుండా అడ్డుపడడంతో తెలంగాణ అభివద్ధి సాధించలేదని ఏకైక కారణంతో 2001లో మన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సాధన పోరాటం చేయడం ఫలితంగా రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు ఉచిత పథకాలు కావని బీజేపీ నాయకులు తెలుసుకొని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎనిమిదేళ్ల పాలల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్ర అభివద్ధి కోసం, నిరుపేదల అభివద్ధి కోసం నిరంతరము కషి చేస్తూ దేశానికి ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలుస్తున్నాడని చెప్పారు. బీజేపీ నాయకులు ఓర్వలేకనే తెలంగాణ ప్రభుత్వంపై మొండి వైఖరితో వ్యవహరిస్తూ అభివద్ధికి అడ్డుపడుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ఉచితపతకాలని ప్రజలను మభ్యపెట్టి మాట్లాడటం సరికాదన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పిటిసిలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత రామకష్ణ, వైస్ చైర్మన్ జైపాల్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సారంగపాణి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, డీఆర్డీఓ శ్రీనివాసరావు, ఏసీపీ శివరామయ్య, తదితరులు పాల్గొన్నారు.