Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ స్వాతంత్య్ర పోరాటంలో, నిజాం వ్యతిరేక ఉద్యమంలో బీజేపీ పాత్ర శూన్యం
- నిజాం వ్యతిరేక పోరాటంలో పాలకుర్తి ప్రాంతానిదే ప్రాధాన్యత
- రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- పాలకుర్తిలో అట్టహాసంగా రాష్ట్ర జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు
నవతెలంగాణ-పాలకుర్తి
ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. 75వ రాష్ట్ర జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను పురస్క రించుకొని పాలకుర్తిలో నిర్వహించిన వేడుకలు అంబ రాన్నంటాయి. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాల కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్యతో కలిసి మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. దేశానికి స్వాతంత్రం వచ్చి, నిజాం వ్యతిరేక పోరాటానికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 16, 17 ,18 తేదీలలో వజ్రోత్సవ వేడుకలు నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. నిజాం వ్యతిరేక పోరాటంలో పాలకుర్తి, దేవరుప్పుల ప్రాంతాలు ప్రధాన భూమిక పోషించాయని తెలిపారు. అనేకమంది నిజాం ఆగడాలను ఎదిరించారని, పాలకుర్తి, దేవరుప్పులకు చెందిన చాకలి ఐలమ్మ,షేక్ బందగి, దొడ్డి కొమ రయ్య, నల్ల నరసింహులు, ప్రధాన భూమిక పోషిం చారని గుర్తు చేశారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభారు పటేల్ సహకారంతో నిజాం పాలన నుండి తెలంగాణ ప్రాంతానికి విముక్తి కల్పించారని తెలిపారు. అంది వచ్చిన తెలంగాణలో ఆంధ్ర పెత్తందారులు పెత్తనం చెలాయించడంతో 65 సంవత్సరాలు తెలంగాణ వెనుకబడి పోయిం దన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 18 ఏళ్ల పాటు శాంతియుత తెలంగాణ సాధన ఉద్యమం జరిగిందని,సీఎం కేసీఆర్ చావును సైతం లెక్క చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ దిగివచ్చి తెలంగాణను ప్రకటించిందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు, తెలంగాణ రాష్ట్రంలో ఎన్టీ రామారావు తరువాత సీఎం కేసీఆర్‌కే ఆ ఘనత దక్కిందన్నారు. ఇద్దరూ అభివద్ధి సంక్షేమం కోసం పాటుపడ్డారని అన్నారు. తెలంగాణ అభివృద్ధిని జీర్ణించుకోలేకే బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నా న్నారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. 8 ఏండ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అభివద్ధి సంక్షేమంలో పురోగతి సాధించిందని తెలిపారు. స్వాతంత్ర పోరాటంతో పాటు, నిజాం వ్యతిరేక పోరా టంలో బీజేపీ పాత్ర శూన్యమని, ఆ పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం విడ్డూరంగా ఉంద న్నారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతోందని విమర్శించారు. స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన గాంధీని చంపింది ఎవరో బీజేపీ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, మహిళాభివద్దికి నిధులు మంజూరు చేశామని ప్రతి మహిళ ఆర్థిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో అరకోటి మందికి పెన్షన్ ఇస్తున్నామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీటిని ఇంటింటికి అందిస్తున్నామని, పంట పెట్టుబడికి ఏడాదికి ఎకరాకు రూ.10 వేలు అందిస్తున్నామని తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గంలో 80 గ్రామాల్లోని చెరువులను, కుంటలను ఎస్సారెస్పీ, దేవాదుల జలాలతో నింపుతున్నామని, మరో 20 గ్రామాల చెరువులు, కుంటలను నింపేందుకు చర్యలు చేపడు తున్నామని తెలిపారు. పాలకుర్తి, బమ్మెర, వల్మిడి ప్రాంతాలను టూరిజం ప్యాకేజీలో పర్యాటక కేంద్రా లుగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. వజ్రో త్సవ వేడుకల సందర్భంగా పాలకుర్తి గ్రామపం చాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బతుకమ్మలతో పాటు కళాకారుల విన్యాసాలు, చిందు యక్షగానం డప్పు కళాకారులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్ర మంలో స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీవో కృష్ణవేణి, ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, జెడ్పీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాసరావు, జిల్లా కోఆప్షన్ ఎండి మదర్, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్లు బాలు నాయక్, నవీన్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ వీరమనేని యాకాంతరావు, ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, ఎంపీడీవో వనపర్తి అశోక్‌కుమార్, తహసీల్ధార్ భూక్య పాల్ సింగ్‌నాయక్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు పాము శ్రీనివాస్, టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు డాక్టర్ మేడారపు సుధాకర్, ఉప సర్పంచుల ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు మారుజోడు సంతోష్, ఎంపీటీసీల ఫోరం జిల్లా గౌరవ అధ్యక్షుడు మాటూరి యాకయ్య పాల్గొన్నారు.